అనూష్కకి అభిమాని ట్విస్ట్

By Staff

అరుంధతి సూపర్ హిట్టుతో ఓ రేంజికి వెళ్ళి పోయిన అనూష్కని తాజాగా ఓ అభిమాని అదరకొట్టాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ హీరో విజయ్ తో చేస్తున్న ఓ తమిళ చిత్రం షూటింగ్ నిమిత్తం అనూష్క రాజమండ్రిలో గత కొద్ది రోజులుగా ఉంది. ఆ రోజు రాజమండ్రి రైల్వై స్టేషన్ లో షాట్స్ తీస్తున్నారు. ఈలోగా అనూష్క వచ్చిందని తెలియగానే ఎక్కడెక్కడి అభిమానులు ఆమెను చుట్టముట్టారు. ఈలోగా ఓ వీరాభిమాని అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరాడు. అయితే అనుష్క తనను కాదన్నట్లుగా అదేమీ పట్టనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయిందట. అయినా వదలని ఆ అభిమాని అనుష్కను ఆటోగ్రాఫ్‌కోసం యూనిట్ సభ్యులు ఆపుతున్నా ఆగకుండా పదే పదే బతిమాలాడాడు.

అయినా ఆమె పట్టించుకుని ఆటోగ్రాఫ్ ఇవ్వకపోవడంతో మండిన ఆ అభిమాని, "ఎం అరుంథతి హిట్‌తో నీకు పొగరెక్కిందా...నీకు తెలియదేమో ఆ సినిమా నీ వల్ల హిట్ అవలేదు. అందులో విలన్ సోనూసూద్ వల్ల, సాయికుమార్ తమ్ముడు రవి వాయిస్ వల్ల హిట్ అయింద"ని అరుస్తూ చిందులేశాడు. దాంతో ఊహించని ఈ పరిణామానికి యూనిట్ సభ్యులు, అనూష్క అంతా షాక్ అయిపోయారు. అప్పుడు కొందరు అనూష్క శ్రేయాభిలాషులు పబ్లిక్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి మేడమ్ అని సర్ది చెప్పారు. దాంతో కాస్సేపటికి కూల్ అయిన ఆమె ఆ అభిమానిని పిలిపించమని పురమాయించింది. కానీ అప్పటికే ఆ అభిమాని గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఆ రోజంతా అదో హాట్ టాపిక్ అయిపోయింది అక్కడున్న వారికి. అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X