»   » అనుష్క బొడ్డుపైనే గురిపెట్టిన నాగార్జున!

అనుష్క బొడ్డుపైనే గురిపెట్టిన నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున హీరోగా రూపొందిన 'సూపర్' సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుపెట్టిన కన్నడ భామ అనుష్క అలియాస్ స్వీటీ ఆ చిత్రంలో తన అందాల ఆరబోతతో సూపర్ అనిపించుకుంది. ఆ చిత్రంలో అనుష్క నాభి అందాల ప్రదర్శనకు ఫుల్ మార్కులు పడ్డాయి. నాగార్జునకు తగిన జోడీ అని ప్రశంసలు అందుకుంది.

ఆ చిత్రంతో మొదలైన నాగార్జన, అనుష్క జోడీ ఆ తర్వాత చాలా సినిమాల్లో రిపీట్ అయింది. డాన్ చిత్రంలో నాగార్జునతో సెక్సీగా రొమాన్స్ చేసిన స్వీటీ....ఆ తర్వాత వచ్చిన రగడ చిత్రంలో తన అందాల ప్రదర్శనతో రగడ సృష్టించింది. ఆ చిత్రంలో అనుష్క నాభి అందాలను బాగా ఎక్స్ ఫోజ్ చేసి చూపి రసిక ప్రేక్షకుల కనువిందు చేసారు.

తాజాగా 'డమరుకం' చిత్రంలోనూ అనుష్క గ్లామర్ ప్రదర్శనకు పెద్దపీట వేసినట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల విడుదలైన డమరుకం స్టిల్స్‌తో నాగార్జున అనుష్క బొడ్డుపైనే గురిపెట్టి చూడటం....గ్లామర్ విందు కోరుకునే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తాకు కోరుకున్న మసాలా సాంగులు, సీన్లు ఉంటాయని ఆశిస్తున్నారు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న 'డమరుకం' చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకం శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో డా.వెంకట్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, సమీర్, శ్రవణ్, రాజా శ్రీధర్, ప్రభు, కమల్, ప్రగతి రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: చోటాకె నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: వెంకట్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.

English summary
Anushka navel show in Nagarjuna starrer Damarukam, which is directed by Srinivas Reddy and produced by RR Movie Makers. The film, which is nearing completion, is scheduled for October 19 release.
Please Wait while comments are loading...