అనుష్క 'నిశ్శబ్దం' కోసం డేట్ ఫిక్స్.. ఆ డీల్ సెట్టయ్యే వరకు క్లారిటీ వచ్చేలా లేదు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తానికి నిర్మాతలకు ఒక క్లారీటి వచ్చేసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను రిలీజ్ చేయకుండా ఉంచడం అంత సేఫ్ కాదని చాలా మంది ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. నాని V సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావడంతో ఒక్కసారిగా మిగతా సినిమాలు కూడా ఓటీటీ డీలింగ్స్ పై చర్చలు మొదలుపెట్టాయి.

కోన వెంకట్ నిర్మించిన అనుష్క నిశ్శబ్దం సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సీజీ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన ఆలస్యం అయ్యింది. ఇక ఆ తరువాత లాక్ డౌన్ మొదలవ్వడంతో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతనే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్, మలయాళం భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.

Anushka nishabdam movie latest update ott release date

ఇక మొత్తానికి V సినిమా అనంతరం చిత్ర యూనిట్ అమెజాన్ ఓటీటీ సంస్థతో చర్చలకు దిగింది. సినిమా బడ్జెట్ కంటే కాస్త రేటు ఎక్కువగానే చెబుతున్నా ఎందుకో చిత్ర యూనిట్ ఒప్పుకోవడం లేదట. కానీ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదని సమాచారం. ఇక సినిమా కోసం రెండు డేట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నారట. అక్టోబర్ 10 లేదా 17వ తేది నాడు సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నెక్స్ట్ వీక్ మరోసారి చర్చలు జరిపిన తరువాత ఫైనల్ డేట్ ను స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులే ఎనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X