స్టార్ డైరక్టర్ కి సారి చెప్పి తప్పుకున్న అనుష్క
హాట్ స్టార్ అనుష్క దర్శుకుడు రోహిత్ శెట్టి(గోల్ మాల్ ఫేమ్)కి సారి చెప్పి...తాను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కంఫర్ట్ గానే ఉన్నట్లు తెలియచేసింది. ఆమెకు సింగం(యముడు) హిందీ రీమేక్ లో ఈ దర్శకుడు నటించమని ఒత్తిడి తెస్తున్నాడు. అయితే రకరకాలుగా డేట్స్, కేటాయించాల్సిన టైమ్ బేరేజ్ చేసుకున్న అనుష్క శెట్టినో చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరో ప్రక్క ఆమె తోటి హీరోయిన్స్ త్రిష, అసిన్, ఇలియానా వంటివారు బాలీవుడ్ ని ఎలాగయినా ఏలాలని ప్లాన్స్ వేసుకుంటూంటే అనుష్క కాదనటం అంతటా చర్చనీయాంశమయింది.
ఇక రిలియన్స్ బిగ్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని హిందిలో నిర్మిస్తున్నారు. వీరే తమిళంలో సింగం చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేసారు. హీరోగా అజయ్ దేవగన్ ని తీసుకున్నారు. అయితే హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అన్న విషయంలోనే తర్జన భర్జన పడుతున్నారు. మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కరీనా కపూర్ ని తీసుకుందామని నిర్మాతలు పట్టుపడుతున్నారు. మిగతా ఆర్టిస్టులు ఎవరన్నది త్వరలోనే ఫైనలైజ్ కానుంది. అలాగే విలన్ గా ఫ్రకాష్ రాజ్ నే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











