అరుంధతి...రుద్రమదేవిగా!
అరుంధతి చిత్రంలో తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది అనుష్క. ఈ చిత్రం తర్వాత 'పంచాక్షరీ' అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో నటించినా ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు దూరంగా ఉన్న అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోతున్న 'రుద్రమదేవి' చిత్రంలో నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. గుణశేఖర్ చెప్పిన స్క్రిప్టు 'అరుంధతి' రేంజ్ లో పవర్ ఫుల్‌గా ఉండటమే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం అంటున్నారు. చాలా రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతున్నా తాజాగా కన్ ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
12వ శతాబ్ధంలోని కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో చారిత్రాత్మక చిత్రంగా రూపొందించడానికి గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం స్క్రిపును గుణశేఖర్ దాదాపుగా పదేళ్లుగా తయారు చేస్తున్నాడు. ఇన్నేళు నిరీక్షించడానికి కారణం ఆ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లేక పోవడమ అంటున్నారు దర్శకుడు. ఇప్పుడు అన్నీ అందుబాటులోకి రావడంతో భారీ బడ్జెట్ తో, ఉన్నత సాంకేతిక విలువలతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అనుష్క తెలుగులో నాగార్జున కథానాయకుడిగా శ్రీనివాసడ్డి దర్శకత్వం వహిస్తున్న 'డమరుకం' చిత్రంలోనూ, తమిళంలో విక్రమ్‌తో 'తాండవం', ఆర్యతో 'ఇరండం ఉళగం' చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











