‘మిర్చి’లో అనుష్క సొంత టాలెంట్ వర్కౌట్ అయ్యేనా?
హైదరాబాద్ : హాట్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ప్రభాస్ సరసన 'మిర్చి' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి అనుష్కపై ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈచిత్రంలో అనుష్క తన సొంత టాలెంట్ ఉపయోగించబోతోంది. ఈ సినిమా నుంచి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతోందట. మరి అనుష్క రియల్ వాయిస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో? ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
మిర్చి సినిమా విషయానికొస్తే...ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈచిత్రంలో ప్రభాస్ సరసన అనుష్కతో పాటు, రీచా గంగోపాధ్యాయ్ నటిస్తోంది. కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మిర్చి ఆడియో విడుదల కార్యక్రమం జనవరి మొదటి వారం(జనవరి 5)న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేయనున్నారు. ప్రభాస్ పాత్ర విషయానికొస్తే..''మిర్చి కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో... అలాగే ఉంటుంది కథానాయకుడి పాత్ర ఉంటుంది. నేటి తరం కుర్రాళ్లలో ఉండే దూకుడుతోపాటు వెన్నలాంటి మనసు కూడా అతని సొంతం.
వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సంపత్‌కుమార్, ఆదిత్య మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











