రజనీకాంత్‌తో జతకడుతున్న అనుష్క..?
రజనీకాంత్ 'రాణా"సినిమాను అటకెక్కించి కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కోచాదయన్" సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అందిన సమచారం ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అనుష్కను ఎంపిక చేయనున్నారని సమాచారం. ఈ సినిమా కథకు అనుష్క పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు. రజనీకాంత్ వయసు తగిన విధంగా అనుష్క ఉండటంతో పాటు, తమిళ అభిమానులను ఆకట్టుకునే అరేబియన్ గుర్రం లాంటి పిటపిటలాడే అందం అనుష్క సొంతం కావడంతో.....ఆమెను రజనీ సరసన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి 3డి ఎఫెక్టులతో కోచాదయన్ సినిమా రూపొందిస్తున్నారు. రజనీ చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కె.ఎస్. రవికుమార్ కథ అందించారు. సౌందర్యకు దర్శకత్వం కొత్త కావడంతో రవి కుమార్ పర్యవేక్షణలో ఆమె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











