అనుష్కతో ఉండే ఆడా, మొగా కాని క్యారెక్టర్ ఎవరంటే..
వేదం చిత్రంలో అమలాపురం సరోజ గా అనుష్క అదరకొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రని అంటిపెట్టుకుని కర్పూరం అనే పాత్ర ఉంటుంది. ఆడా,మొగా కానీ గెటప్ లో ఉన్న ఆ పాత్రని పోషించింది మరెవరో కాదు...నిక్కి. అంటే అనుష్క పర్శనల్ మేకప్ మ్యాన్. మొదట ఆ పాత్రకు చాలా మందిని అనుకుని, చివరకు అనుష్క రికమండేషన్ తో దానిని నిక్కికి ఇచ్చారు. ఆ పాత్రలో అతను జీవించాడనే చెప్పాలి. ఓ చోట మగాళ్ళకు, ఆడాళ్ళకు ప్రత్యేకమైన బాత్రూమ్ లు ఉన్నాయి..మరి మాలాంటోళ్ళకి అనే ఆర్ధం వచ్చేలాగ డైలాగు చెప్పటం ధియోటర్ లో టప్పట్లు కొట్టించింది. అలాగే పోలీస్ ఆఫీసర్ (పోసాని) ఆమె పేరు అడిగి..కర్పూరం అని చెపితే అగరబత్తేం కాదు అనటం..అక్కడ ఆమె ఎక్సప్రెషన్స్ ఆ పాత్రను మరింత దగ్గరకు చేర్చాయి. ఇక నాగార్జున...తన పర్శనల్ మేకప్ మెన్ చంద్రను నిర్మాతను చేస్తున్నట్లే..అనుష్క..నిక్కిని నటుడ్ని చేసింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











