అనుష్క డ్యూయల్ రోల్..శృతిహాసన్ గెస్ట్ రోల్
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి మరోసారి మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో పీవీపీ సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాత. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి 'సైజ్ జీరో' అనే పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఆ రెండూ డిఫరెంట్ గెటప్ లను చెప్తున్నారు. అలాగే శృతిహాసన్ ..గెస్ట్ రోల్ లో కనిపించనుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఆర్య, భరత్, వూర్వశి ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు 'సైజ్ జీరో' సోమవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అనుష్కపై తెరకెక్కించిన ముహూర్తపు సన్నివేశానికి కనిక దిల్లాన్ కోవెలమూడి క్లాప్ నిచ్చారు. ఝాన్సీ స్విచ్చాన్ చేశారు. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

అనుష్క సరసన తమిళ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్నారు. ‘వర్ణ' తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది. శృతి హాసన్ అతిథి పాత్ర ‘సైజ్ జీరో'కు ప్రత్యేక ఆకర్షణ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమాను నిర్మించనున్నారు.
రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: నిర్వాషా, కళ: ఆనంద్‌సాయి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం


Click it and Unblock the Notifications











