అనుష్క, చెర్రీల మధ్య భారీ అగ్రిమెంట్.. అడిగిన వెంటనే కమిట్ అయిన చెర్రీ

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతూ ప్రపంచ వ్యాప్త క్రేజ్ సంపాదించింది అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఖాతాలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. ఇటీవలే బాహుబలి సిరీస్‌తో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క జోరు కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. చివరగా భాగమతి సినిమాలో నటించిన అనుష్క ఆ తర్వాత వెండితెరకు కాస్త దూరమైంది. కొంత గ్యాప్ తీసుకొని కుందనపు బొమ్మలా తయారై తిరిగి ఇప్పుడు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమైంది.

ఇటీవలే సైలెన్స్ అనే డిఫెరెంట్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క.. తెలుగులో చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో కూడా భాగం కాబోతోంది. ఈ కథ నేరేషన్ అనుష్కతోనే చెప్పిస్తారని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో చిరుతో ఓ పాటలో కూడా అనుష్క చిందులేయనుంది.

Anushka Ramcharan commitment for Sy Raa Narasimhaa Reddy

అయితే సైరాలో తన పార్ట్ చిన్నదే అయినా భారీ మొత్తం డిమాండ్ చేసిందట అనుష్క. దీంతో ఆమె కోరిన కోరికకు సానుకూలంగా స్పందించాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. అనుష్క డిమాండ్‌ని వెంటనే అంగీకరించాడని సమాచారం. అనుష్క లాంటి పెద్ద హీరోయిన్ తమ సినిమాలో నటించడమే గ్రేట్.. అనుకోసం ఎంత రెమ్మ్యూనరేషన్ ఇచ్చేందుకైనా సిద్దమే అని చెర్రీ అన్నాడట. మొత్తానికైతే ఈ ఇద్దరి మధ్య భారీ అగ్రిమెంటే జరిగిందని తెలుస్తోంది.

చిరు కెరీర్ లో 151వ సినిమాగా సైరా నరసింహా రెడ్డి తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాను భారీ హంగులతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. చిరు సరసన నయన తార, తమన్నా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కుచ్చ సుదీప్ లాంటి భారీ తారాగణం సైరా లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X