బాలకృష్ణకు మళ్ళీ అదే సమస్య ఎదురైంది
బాలకృష్ణకు ఈ మధ్యన ఆయన సరసన చేయటానికి స్టార్ హీరోయిన్స్ ఎవరూ దొరకటం లేదు. యంగ్ హీరోయిన్స్ ఆయనతో చేయటానికి ఏజ్ గ్యాప్ అని ఆసక్తి చూపటం లేదు. త్రిష,అనుష్క వంటివారు సైతం డేట్స్ ఖాళి లేవని తప్పించుకుంటున్నారు. గతం నాలుగైదు చిత్రాల నుంచి అదే పరిస్దితి ఆయనకు ఎదురౌతోంది. తాజాగా అనుష్కతో అంతా ఓకే అనుకున్నాక ఆమె రిజెక్టు చేసిందని సమాచారం.
వివారాల్లోకి వెళితే..బాలకృష్ణ సరసన అనుష్క ఖరారైందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందే ఆదిత్య 999 లో ఆమెను తీసుకున్నారంటూ వినపడింది. అయితే ఆమె నో చెప్పిందని,డేట్స్ ఖాళీ లేవని ఆఫర్ రిజెక్టు చేసిందని సమాచారం. అనుష్క, బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక్క మగాడు తర్వాత సినిమాలు ఇప్పటివరకూ రాలేదు. అయితే అభిమానులుకు ఆ ఆనందం త్వరలో దక్కనుందని ముచ్చట పడ్డారు. అయితే అది నెరవేరలేదు.
బాలకృష్ణ హీరోగా ఆనాటి సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369'సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు మరియు వినోద్ కలిసి నిర్మించనున్నారు. కొండ కృష్ణం రాజు ఈ సినిమాని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు నుండి ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
అలాగే అనుష్క ప్రస్తుతం తమిళంలో చేస్తున్న చిత్రం బృందావనంలో నందకుమారుడు అనే టైటిల్ తో రిలీజ్ అవుతోంది. అనుష్క,ఆర్య కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇరాండం ఉలగం టైటిల్ తో ఈ చిత్రం తమిళంలో విడుదల కానుంది. ఇందులోని ఓ పాత్ర కోసం అనుష్క రీసెంట్ గా మార్షిల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇందులో రాధిక ఓ కీలకపాత్రను పోషిస్తోంది. తమిళంలో ఈ చిత్రాన్ని యూ.టీవి మోషన్ పిక్చర్స్ వారు సమర్పిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రసాద్ .వి.పొట్లూరి అందిస్తున్నారు. ఇందులో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ రేంజిలో ఈ చిత్రం అద్బుతంగా రూపొందుతోందని చెన్నై వర్గాల టాక్.


Click it and Unblock the Notifications











