గర్భవతిగా సెక్సీ అనుష్క?
హీరోయిన్ అనుష్క్ త్వరలో గర్భవతిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. విద్యాబాలన్ హిందీలో నటించిన సూపర్ హిట్ మూవీ 'కహానీ' తమిళ, తెలుగు రీమేక్‌లో అనుష్కను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
కహానీ చిత్రంలో విద్యాబాలన్ గర్భవతి పాత్రలో నటించింది. కనిపించకుండా పోయిన తన భర్తను వెతుక్కుంటూ నగరానికి వెలుతుంది. ఈక్రమంలో సినిమా ఆ సక్తికంగా సాగుతుంది. డర్టీ పిక్చర్ తర్వాత ఈచిత్రం విద్యాబాలన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. చాలా కాలంగా సరైన హిట్ లేని అనుష్క 'కహానీ' పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
విద్యా బాలన్ నటించిన 'డర్టీ పిక్చర్' రీమేక్‌లో అనుష్కను కోరినప్పటికీ...అమ్మడు తిరస్కరించింది. ఆ పాత్రలో వల్గారిటీ ఎక్కువగా ఉందనే కారణంతో అనుష్క అలా చేసింది. అయితే కహానీ చిత్రం తన కెరీర్‌కు ప్లస్సయ్యే లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉండటంతో తైరపై గర్భం దాల్చడానికి ఆసక్తి చూపుతోందట అనుష్క.
ప్రస్తుతం అనుష్క డమరుకం, వారధి చిత్రాలతో పాటు కార్తితో శకుని, ఆర్యతో ఇరండం ఉలగం, విక్రమ్ హీరోగా రూపొందుతున్న తాండవం చిత్రాల్లో బిజీగా గడుపుతోంది. ఈ బిజీ షెడ్యూల్ వల్ల కహానీ చిత్రం సౌత్ వెర్షన్‌కు అనుష్క ఇంకా డేట్స్ కేటాయించ లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











