అనుష్క ను వరించబోయే ఆ కరెక్ట్ పర్సన్ ఎవరు..?
'సూపర్" చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయిన అందాల బొమ్మ అనుష్క త్వరలో శ్రీమతి కానుందట. అయితే ఈ విషయం అనుష్క అభిమానులకు బాధకలిగించే వార్త అయినప్పటికీ ఇదే నిజం కానుందట. అయినా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు తమ అందాలను భర్తలకు అప్పజెప్తే ప్రేక్షకులు ఏమైపోవాలి. ఈ మధ్య జయప్రద నిర్వహిస్తున్న ఓ టీవి ప్రోగ్రామ్ లో ఈ విషయాలను వెల్లడించింది.
తనకు కాబోయే వాడు తనకు బాగా తెలిసిన వాడేననీ, నేను ఒకే అనడమే ఆలస్యమనీ డైరెక్ట్ గా చెప్పేసింది. ఆ టీవి ప్రోగ్రామ్ లో అనుష్క చెప్పిన విషయాల్లో చాలా వరకు ఆమె ఫ్యామిలీకి ఆ వరుడిని అంగీకరయోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకీ అనుష్క కు కాబోయే వరుడు ఎవరు? అనేది ఇప్పడు టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. ఈ టాపిక్ పై టాలీవుడ్ లో వరుడు గోపిచంద్ కావచ్చని కొందరు అనుకుంటే..ఇంకొందరు సెంథిల్ అయి ఉంటాడనీ అనుకుంటున్నారు. ఇంకా మరికొందరైతే భరత్ ఠాకూర్ తమ్ముడిని చేసుకొని భూమికకు తోడి కోడలిగా వెళ్ళాలనుకుంటుందన్నట్లు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











