అనుష్క నటగురువు నాగార్జున అంటోంది!
అందాల తార అనుష్క ఇప్పటివరకూ దాదాపు పదిమంది హీరోల సరసన కథానాయికగా నటించింది. ఇప్పటివరకూ ఏ హీరోతోనూ అనుష్కకు గొడవలు లేవు. చాలావరకు అందరితో ఫ్రెండ్లీగానే ఉంటానని ఈ బ్యూటీ చెబుతోంది. ఇక తనతో జత కట్టిన కొంతమంది హీరోల గురించి అనుష్క చెప్పిన అభిప్రాయాలు.
నా తొలి హీరో నాగార్జున. తెలుగులో మొదటి సినిమా 'సూపర్'. కథానాయికగా ఇది నాకు మొదటి సినిమా కాబట్టి సన్నివేశంలో ఎలా నిలబడాలో కూడా తెలిసేది కాదు. ఆ విషయంలో నాగార్జున నాకు హెల్ప్ చేసేవారు. తనో స్టార్ హీరో అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ఎంకరేజ్ చేసేవారు. అందుకే నాగ్ ని నా నట గురువుగా భావిస్తాను.


Click it and Unblock the Notifications











