మహేష్ ని అనూష్క రేప్ చేయటమే హైలెట్...
మహేష్‌ని అనుష్క రేప్ చేసే సరదా సన్నివేశం ఖలేజా చిత్రంలో హైలెట్స్‌గా నిలుస్తాయంటున్నారు. అల్లరిగా ఎప్పుడూ మహేష్ ని ఆటపట్టిస్తూ ఉండే డబ్బున్న అమ్మాయి గా అనూష్క కనిపిస్తుంది. ఆమె కనపడినప్పుడల్లా ధియోటర్ లో నవ్వలు పండుతాయంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ గురించి అయితే చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. రాజస్ధాన్ లో ఓ పల్లె జనం తమకు కావల్సిన మనిషి కోసం వెతుకుతూంటారని, మహేష్ వారికి కావాల్సిన రక్షకుడు అని తెలియటం,దాంతో వారు స్పందించే తీరు అంతా సూపర్ గా వచ్చిందని చెప్తున్నారు. ఇక సీతారామరాజుగా మహేష్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇక మహేష్ బాబు 'ఖలేజా' గురించి మాట్లాడుతూ.."నేను నా కెరీర్ లో ఎప్పుడూ అలాంటి రోల్ చెయ్యలేదు. ఈ చిత్రంలో నేను ఎప్పుడూ మాట్లాడుతూండే పన్నీ టాక్సీ డ్రైవర్ ని. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. ఈ చిత్రంలో మెసేజ్ లు ఏమీ ఉండవు. ఏ ఫైటూ కూడా కేవలం ఫైట్ కోసమే పెట్టినట్లుండదు..అంతా రియలిస్టిక్ గా, నమ్మశక్యంగా ఉంటుంది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఓ మంచి చిత్రానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఈ సినిమాకు ఉన్నాయి అన్నారు.
అలాగే త్రివిక్రమ్ ఈ చిత్రం గురించి చెబుతూ.. దైవమ్ మానుష్య రూపేణా అనేది ఖలేజా చిత్రం ధీమ్. ప్రతీ మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు అనేదే చెప్పబోతున్నాం అన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు..ఓ సాధారణ టాక్సీ డ్రైవర్. ఆ అతి సాధారణమైన మనిషి ఊహకు అందని ఓ సంఘటన వల్ల దైవత్వం నిండిన మనిషిగా మారతాడు. నిజాయితీగా చెప్పుతున్నా..మేము మొదట ఓ రెగ్యులర్ కమర్షియల్ మహేష్ బాబు సినిమా చేద్దామనుకున్నాం. కానీ లైఫ్ అనేది సినిమాకి దానంతట అదే వచ్చింది. ఈ చిత్రంలో మీరు ఓ కొత్త మహేష్ బాబుని చూస్తారు. అతను తన హద్దులు దాటి కామిడీని ఎలా పండించాడో తెలుస్తుంది. ఈ సినిమాలో అతనో కమిడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, ఐటం గై, యాక్షన్ హీరో, లవర్ బోయ్ ఇలా అన్నీ ఒకే పాత్రలో ఇమిడాయి అని ధీమాగా చెప్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ ...దాదాపు నలభై కోట్ల ఖర్చుతో నిర్మించారు.


Click it and Unblock the Notifications











