»   » అనుష్క.... సీక్రెట్ రిలేషన్ షిప్, ఆపై బ్రేకప్?

అనుష్క.... సీక్రెట్ రిలేషన్ షిప్, ఆపై బ్రేకప్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా హాట్ బ్యూటీ అనుష్క వీలైనంత వరకు తనపై గాసిప్స్ రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అయినా ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది. ఇండస్ట్రీలో అందరితో ఆమె ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడమే ఇలాంటి రూమర్స్ కు కారణం. అయితే ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేసింది ఈ కన్నడ కస్తూరి.

అయితే తాజాగా అనుష్క గురించి ఓ పుకారు ప్రచారంలోకి వచ్చింది. లవ్ మ్యారేజ్ చేసుకోవానికి మొదటి నుండి ఆసక్తి చూపుతున్న అనుష్క గత కొంత కాలంగా ఓ వ్యక్తితో సీక్రెట్ గా రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తోందని, అయితే కొంతకాలానికే అతనితో విబేధాలు వచ్చి బ్రేకప్ కూడా అయిపోయిందని అంటున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అనే విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు.

Anushka's Secret Relationship And Break Up?

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క..... తనకు తగిన జోడీ కోసం అన్వేషిస్తోందట. మరి అనుష్కకు తగిన వాడు ఎక్కడున్నాడో? ఏంటో? ఆమె వయసు మాత్రం ఇప్పటికే 33 దాటేసింది.

అనుష్క సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె నటించిన రెండు భారీ ప్రాజెక్టులు విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి' చిత్రం కాగా, మరొకటి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ.

English summary
Anushka Shetty, who always try to keep herself away from gossip columns, has of late became a favorite of gossip mongers. Her off-screen simplicity and extremely friendly nature with everyone in the industry has got her immense respect in the film fraternity as well as Telugu movie lovers.
Please Wait while comments are loading...