హైదరాబాద్ బిజినెస్‌మేన్‌తో అనుష్క పెళ్లి?
హైదరాబాద్: సౌతిండియా సెక్సీ హీరోయిన్ అనుష్కపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అనుష్కకు ఈ హీరోతో ఎఫైర్ ఉందని, అనుష్క ఈ దర్శకుడిని పెళ్లి చేసుకోబోతోందని తరచూ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అనుష్కకు ప్రేక్షకుల్లో ఏ రేంజిలో పాపులారిటీ ఉందో అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఈ పుకార్లు ఉండటం గమనార్హం.
ఆమెతో పని చేసిన ప్రతి యాక్టర్.... అనుష్కతో 'సం'బంధం ఉందనే టాక్ తో వార్తలకెక్కడం ఈ మధ్య సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అనుష్కపై మరో గాసిప్ వినిపిస్తోంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అవుతోందనేది తాజాగా వార్తల సారాంశం. అంతే కాదు సినిమాలకు స్వస్తి చెప్పి సంసార జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటోందట.
తాజాగా సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఓ బిజినెస్‌మేన్‌తో అనుష్క డేటింగ్ చేస్తోందని తెలుస్తోంది. అనుష్క కుటుంబ సభ్యులు త్వరలోనే ఆమెకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారని, అతడు ఆమెకు పర్ ఫెక్ట్ మ్యాచ్ అని అంతా ఒక నిర్ణయానికి వచ్చారని టాక్.
ఈ మధ్య అనుష్క ఎక్కువగా సినిమాలకు సైన్ చేయలేదు. గుణశేఖర్ 'రుద్రమదేవి', రాజమౌళి 'బహుబలి' సినిమాలకు మాత్రమే సైన్ చేసింది. పెళ్లి ఆలోచన ఉండటం వల్లనే ఎక్కవ సినిమాలకు ఒప్పకుండా ఎక్కవ ఖాళీ సమయం ఉండేలా చూసుకుంటోందని అంటున్నారు.
ఇప్పటి వరకు అనుష్కకు పలువురు నటులతో 'సం'బంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారి వివరాలు స్లైడ్ షోలో చూద్దాం....

నాగార్జున సినిమా వల్లనే అనుష్క వెండి తెరకు పరిచయం అయింది. ఇద్దరూ క్లోజ్ గా ఉండటంతో ఈ ఇద్దరి మధ్య ‘సం'బంధం ఉందనే వార్తలు అప్పట్లో వినిపించాయి.

అప్పట్లో ఓ మేగజైన్ నాగచైతన్యను అనుష్క పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచురించింది. అయితే ఈ వార్తలను అనుష్క ఖండించింది.

క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించిన అనుష్క అతనికి దగ్గరైందని, త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. అయితే ఆ వార్తలో వస్తవం లేదని తేలింది.

తమిళ వెర్షన్ వేదం చిత్రంలో కలిసిన నటించిన అనుష్క, శింబు ఓ రెస్టారెంటులో కలిసి కనిపించడంతో ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

లక్ష్యం, శౌర్యం చిత్రాల్లో గోపీచంద్ తో కలిసి నటించిన అనుష్క... అతనితో ప్రేమలో పడ్డట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











