నేను ఏ క్రికెటర్తో రొమాన్స్ చేయడం లేదు: అనుష్క
గతంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఎఫైర్ నడిపిన స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తాజాగా టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాతో డేటింగ్ చేస్తుందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సురేష్ రైనాతో రొమాన్స్ రూమర్స్‌పై స్పందించిన అనుష్క శర్మ ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని తెలిపింది. నేను ఏ ఇండియన్ క్రికెటర్ లేదా వేరే ఎవరితో డేటింగ్ చేయడం లేదని స్ఫష్టం చేసింది.
ఐతే వీరిద్దరూ మొదటి సారి లండన్‌లో కలిశారట. గతేడాది భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు రైనా, అనుష్క మధ్య స్నేహం విరిసిందని ఓ ప్రముఖ పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత అదే స్నేహాం ముదిరి డేటింగ్ దాకా వెళ్లినట్టు సమాచారం. ఐతే రైనాతో పరిచయం గురించి అనుష్క మేనేజర్ తారిక మాట్లాడుతూ లండన్‌లోని ఓ పార్టీలో రైనాను కలిసినట్టు ఆమెకు గుర్తే లేదని, అసలు అనుష్కకు క్రికెట్ అంటేనే ఇష్టం లేదని తెలిపారు.


Click it and Unblock the Notifications












