»   » అనుష్క శర్మ-విరాట్ కోహ్లి విడిపోయారు... కారణం ఏమిటి?

అనుష్క శర్మ-విరాట్ కోహ్లి విడిపోయారు... కారణం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2016వ సంవత్సరం బాలీవుడ్ జంటలకు అంతగా కలిసొచ్చేట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలోనే కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా చేరినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న ఈ ఇద్దరూ తాజాగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు గల కారణాలు ఏమిటో చూద్దాం...

2016 సంవత్సరంలో అనుష్క శర్మ తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే పెట్టాలని నిర్ణయించుకుంది. నటిగా, నిర్మాతగా ఉన్నత స్థాయికి ఎదగాలనేది ఆమె లక్ష్యం. కాని పెళ్లి చేసుకుని సెటిలైపోదామని కోహ్లి ఉద్దేశ్యం. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంకొంత కాలం వెయిట్ చేయాలనేది అనుష్క అభిప్రాయం. ఈ విషయమై ఇద్దరి మద్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయేంతగా గొడవ జరిగినట్లు సమాచారం.

విరాట్ కోహ్లి...ఇన్‌స్టా గ్రామ్ లో అనుష్కను అన్‌ఫోలో అయ్యాడంటే పరిస్థితి ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య అనుష్క శర్మతో మాట్లాడటమే మానేసాడట. కొన్ని రోజుల క్రితం కూడా విరాట్ గురించి అనుష్కను మీడియా వారుప్రశ్నించగా...‘వి ఆర్ టూ నార్మల్ యంగ్ పీపుల్ ఇన్ ఎ రిలేషన్‌షిప్' అంటూ సమాధానం ఇచ్చింది.

‘పబ్లిక్ ఫిగర్ అయినపుడు...వారి రిలేషన్ షిప్ జనాలకు ఎంటర్టెన్మెంట్ టాపిక్ అవుతుంది. అయితే నా వరకు అది సౌకర్యవంతంగా అనిపించదు. కొన్ని విషయాలను నేను పూర్తిగా పర్సనల్ గా భావిస్తాను. వాటిని నేను బయటికి మాట్లాడటానికి ఇష్టపడను' అని చెప్పడం గమనార్హం.

‘మేము ఇప్పటి వరకు ఏ విషయం దాచలేదు. ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నించలేదు. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు పదే పదే అదే ప్రశ్న అడిగితే....అదో డిబేటబుల్ మ్యాటర్ అవుతుంది. ఇద్దరికీ అది సరైది కాదు అనిపిస్తుంది' అని అనుష్క తెలిపింది.

అనుష్క శర్మ

అనుష్క శర్మ

అనుష్క శర్మ ఫస్ట్ బ్రేకప్ 2007లో ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రాడ్రిక్స్ తో జరిగింది. (ఫోటోలో అనుష్క-విరాట్)

తెరంగ్రేటం

తెరంగ్రేటం

షారుక్ ఖాన్ నటించిన ‘రబ్ దే బనాదీ జోడి' సినిమాతో అనుష్క శర్మ 2008లో తెరంగ్రేటం చేసింది. (ఫోటోలో అనుష్క-విరాట్)

బ్యాండ్ బాజా బారత్

బ్యాండ్ బాజా బారత్

2010లో ‘బ్యాండ్ బాజా బారత్' సినిమా అనుష్క కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్

2012లో అనుష్క శర్మ బెస్ట్ సపోర్టింగ్ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

పికె

పికె

2014లో వచ్చిన పికె సినిమాతో అనుష్క శర్మ బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.

ఎన్.హెచ్ 10

ఎన్.హెచ్ 10

ఎన్.హెచ్ 10 సినిమాతో అనుష్క శర్మ సహనిర్మాతగా మారింది.

అనుష్క-విరాట్

అనుష్క-విరాట్

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
It seems that 2016 is not very lucky for our Bollywood couple. We are already shocked with Ranbir Kapoor and Katrina Kaif 's breakup and now it has been revealed that even Anushka Sharma and Virat Kohli have separated. Read below the reason behind their separation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu