పికె: నెక్ట్స్ పోస్టర్లో అనుష్క శర్మ నగ్నంగానా?
హైదరాబాద్: అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పికె' కు సంబంధించి ఆ మధ్య విడుదలైన న్యూడ్ లుక్ పోస్టర్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కేసు కూడా బుక్ అయింది. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్ నగ్న అవతారంలో సీక్రెట్ పార్ట్స్‌కి కేవలం రేడియో అడ్డం పెట్టుకుని దర్శనమిచ్చారు.
త్వరలో ‘పికె' చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ విడుదల కాబతోంది. ఆ పోస్టర్లో ఈ సారి హీరోయిన్ అనుష్క శర్మ రేడియోతో కనబడబోతోందట. గతంలో అమీర్ ఖాన్ రేడియోతో నగ్నంగా కనిపించిన నేపథ్యంలో.....అనుష్క శర్మ ఎలా కనిపించబోతోంది? అనేది హాట్ టాపిక్ అయింది.
ఈ పోస్టర్‌ను అక్టోబర్ 16న సరికొత్త విధానంలో విడుదల చేయబోతున్నారు. మొబైల్ యాప్...‘వాట్సాఫ్' ద్వారా ఈ పోస్టర్ విడుదల కాబోతోంది. అభిమానులంతా పికె వాట్సాఫ్ గ్రూఫ్ క్రియేట్ చేయాలని అనుష్క శర్మ కోరుతోంది.

రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











