Chiru 156: చిరంజీవికి ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఫిక్స్.. అప్పుడు హ్యాండ్ ఇప్పుడు ఆఫర్
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన స్టార్ హీరోనే మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా.. దాన్ని పూడ్చుకునేందుకు చిరు రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్నింటితో బాగా అలరించారు.
ఈ ఏడాదిలో మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో భారీ విజయాన్ని అందుకున్నారు. కానీ, ఆ తర్వాత 'భోళా శంకర్' మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను చవి చూశారు. దీని నుంచి బయటకు వచ్చేందుకు ఆయన భారీ ప్రాజెక్టును చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే తన 156వ సినిమాను 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్టతో చేయబోతున్నట్లు ప్రకటించారు.

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తి అయ్యాయి. అంతేకాదు, ఈ మూవీ కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి ఆసక్తిని పెంచేశారు. అదే సమయంలో ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్నట్లు కూడా సమాచారాన్ని రివీల్ చేసేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో పెద్ద స్టార్లను భాగం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం హీరోయిన్‌గా అనుష్క శెట్టిని ఫిక్స్ చేశారని తెలిసింది. అలాగే, ఈ చిత్రంలో విలన్‌గా టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ వివరాలు తాజాగా వచ్చాయి.

చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారని తాజాగా తెలిసింది. ఇందులో ఆమె పాత్ర ఎంతో హైలైట్‌గా ఉండబోతుందని సమాచారం. వాస్తవానికి కాజల్ 'ఆచార్య'లో నటించినా ఆమె సీన్స్ అన్నీ కట్ చేశారు. దీంతో అప్పుడు విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు కాజల్‌కు ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. మల్లిడి వశిష్ట - మెగాస్టార్ చిరంజీవి కలయికలో రాబోతున్న ఈ సినిమాను రూ. 200 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీకి 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. అది పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూట్ మొదలు పెడతారని సమాచారం.


Click it and Unblock the Notifications











