ఎట్టకేలకు ఫిక్సైన అనుష్క పెళ్లి: ఆ బడా నిర్మాతతోనే.. ఆయన వయసెంతో తెలుసా?
తెలుగులో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే అందం, అభినయంతో రాణించడంతో పాటు సినిమాల పరంగా విజయాలతో దూసుకెళ్తున్నారు. తద్వారా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క శెట్టి పెళ్లి గురించి ఓ ఊహించని న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
సూపర్‌తో సెన్సేషన్‌గా
అనుష్క శెట్టి.. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. మరిన్ని ఆఫర్లను అందుకుంది. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో భాగం అయింది. దీంతో అనుష్క తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది. దీంతో టాలీవుడ్‌లో ఆమె సెన్సేషన్ అయిపోయింది.

ఆ సినిమాలతో భారీగా
అనుష్క కెరీర్ ఆరంభంలోనే ఎన్నో మంచి చిత్రాలు చేసింది. అందులో ఆమె స్థాయిని పెంచినవి కూడా ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం 'అరుంధతి'. ఇందులో ఈ భామ జీవించి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'బాహుబలి'తో ఈ బ్యూటీ వరల్డ్ మొత్తంలో ఫేమస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో అనుష్క రేంజ్ భారీగా పెరిగిపోయింది.
కెరీర్ బ్రేక్.. ఘాటితో
'బాహుబలి' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అనుష్క 'సైజ్ జీరో' అనే సినిమాలో నటించింది. ఇందులో లావు ఉన్న అమ్మాయిగా కనిపించేందుకు ఆమె భారీగా బరువు పెరిగింది. అప్పటి నుంచి అనుష్కకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ మూవీ తర్వాత ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఇప్పుడు అనుష్క 'ఘాటి' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
ప్రభాస్ పెళ్లి అంటూ
స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన సమయంలోనే అనుష్క శెట్టి పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తుందని, త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ లేకపోయినా తరచూ వీళ్లిద్దరి గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి.

అనుష్క పెళ్లి ఫిక్స్
ఎంతో కాలంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన అసుష్క శెట్టి.. ఈ మధ్య కాస్త స్లో అయిపోయింది. దీంతో ఆమె పెళ్లికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా అనుష్క శెట్టి మ్యారేజ్ గురించి ఓ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ స్టార్ హీరోయిన్ త్వరలోనే ఏడడుగులు వేయబోతుందట.
ఆ నిర్మాతలోనే అని
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాతతో వివాహానికి సిద్ధం అయిందట. త్వరలోనే వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసింది. అంతేకాదు, ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి జరగబోతుందని కూడా తెలుస్తోంది. ఇక, ఆ నిర్మాతకు 42 సంవత్సరాలు అని కూడా న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











