For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘లూసీఫర్’లో చిరంజీవి సరసన ఊహించని హీరోయిన్: అప్పుడు స్పెషల్ సాంగ్.. ఇప్పుడు రొమాన్స్!

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కమ్‌బ్యాక్ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సూపర్ డూపర్ హిట్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అదే సమయంలో వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. అంతేకాదు, ఆయా సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ స్వయంగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి త్వరలోనే చేయబోయే 'లూసీఫర్' రీమేక్‌ కోసం ఓ ఊహించని హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరామె? ఆ వివరాలు మీకోసం!

  హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆ చబ్బీ అందాలు డోస్ తగ్గలేదు

   మెగా మల్టీస్టారర్‌లో నటిస్తోన్న చిరంజీవి

  మెగా మల్టీస్టారర్‌లో నటిస్తోన్న చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. సందేశాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో తండ్రి కొడుకులిద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇందులో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం ఇస్తున్నాడు.

  ‘లూసీఫర్' మూవీని రీమేక్ చేస్తున్నారు

  ‘లూసీఫర్' మూవీని రీమేక్ చేస్తున్నారు

  ‘ఆచార్య' పట్టాలపై ఉండగానే.. మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమాల గురించిన వివరాలు వెల్లడించారు. ఇందులో మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘లూసీఫర్' రీమేక్ ఒకటి. అక్కడ మోహన్ లాల్ నటించిన ఈ సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్నారు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ యాక్షన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

  యంగ్ డైరెక్టర్ ఔట్... మరో డైరెక్టర్ ఇన్

  యంగ్ డైరెక్టర్ ఔట్... మరో డైరెక్టర్ ఇన్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను మొదట.. ప్రభాస్‌తో ‘సాహో' తీసిన సుజిత్ తెరకెక్కిస్తాడని చిరంజీవి ప్రకటించారు. ఆ తర్వాత ఈ స్క్రిప్టుపై అతడు చేసిన పని వర్కౌట్ కాకపోవడంతో దీని నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను దర్శకుడిగా ఎంపిక చేశాడు చిరంజీవి. చాలా గ్యాప్ తర్వాత మరోసారి అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు.

  అదే పనిలో ఉన్న కోలీవుడ్ దర్శకుడు

  అదే పనిలో ఉన్న కోలీవుడ్ దర్శకుడు

  ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపిక అయినప్పటి నుంచి మోహన్ రాజా ‘లూసీఫర్' స్క్రిప్టుపై వర్క్ చేయడం మొదలు పెట్టాడు. మలయాళం పరిస్థితులకు తగ్గ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్న అతడు.. దీని కోసం ఎన్నో సీన్లను కట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అలాగే, చిరంజీవి సూచన మేరకు ముఖ్యమంత్రి పాత్రను కూడా తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి.

   చిరంజీవి కోసం లేని పాత్రను కలిపాడు

  చిరంజీవి కోసం లేని పాత్రను కలిపాడు

  మలయాళంతో పోలిస్తే తెలుగులో కమర్షియల్ హంగులు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే హీరో పాత్రకు మరింత ఎలివేషన్ ఇవ్వబోతున్నాడట మోహన్ రాజా. చిరంజీవి బాడీ లాగ్వేజ్‌కు తగ్గట్లుగానే ఆయన పాత్రను రీ క్రియేట్ చేస్తున్నాడట. మరీ ముఖ్యంగా అందులో లేని హీరోయిన్‌ పాత్రను ఇందులో యాడ్ చేయడంతో పాటు ఓ పాటను కూడా పెడుతున్నాడని టాక్.

  చిరంజీవి సరసన ఊహించని హీరోయిన్

  చిరంజీవి సరసన ఊహించని హీరోయిన్

  ‘లూసీఫర్' రీమేక్‌లో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేశారన్న టాక్ వచ్చినప్పటి నుంచే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కేవలం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ పాత్రలో నయనతార ఫిక్స్ అయినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో త్రిష పేరు కూడా వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో అనుష్క శెట్టి నటిస్తుందట.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
   అప్పుడు స్పెషల్ సాంగ్... ఇప్పుడిలా

  అప్పుడు స్పెషల్ సాంగ్... ఇప్పుడిలా

  చాలా కాలంగా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న అనుష్క శెట్టి.. ఈ మధ్య సినిమాల వేగం తగ్గించింది. తాజాగా ‘లూసీఫర్' రీమేక్‌లో చిరంజీవి సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో మెగాస్టార్ నటించిన ‘స్టాలిన్'లో ఆమె స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్‌గా నటిస్తోంది.

  English summary
  Tollywood Star Hero Megastar Chiranjeevi Will do ‘Lucifer’ Remake. In This Movie Senior Hero Romance with Anushka Shetty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X