ఒక్కటి కాబోతున్న ప్రభాస్ - అనుష్క: ఏంటి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా!
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే నేషనల్ స్టార్లుగా ఎదగడంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'బాహుబలి' మూవీతో బడా స్టార్‌గా ఎదిగిన అతడు.. అప్పటి నుంచి వరుసగా భారీ సినిమాలనే చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో క్రేజీ మూవీలతో వచ్చి అలరించాడు.
వరుసగా మూవీలు చేస్తున్నా హిట్ కొట్టని ప్రభాస్ గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్'తో క్రేజీ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ', 'సలార్ 2', 'రాజా సాబ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ప్రకటించాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రానికి 'స్పిరిట్' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా రోజులే అవుతోన్నా.. ప్రభాస్, సందీప్ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం మొదలవలేదు. కానీ, ఈ చిత్రంపై అంచనాలు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
హై రేంజ్ యాక్షన్‌తో రాబోతున్న 'స్పిరిట్' మూవీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇక, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా అనుష్క శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేస్తుందని తెలిసింది.

ప్రభాస్ నటిస్తోన్న 'స్పిరిట్'లో హీరోయిన్‌గా ఎంతో మంది పేర్లను పరిశీలించారట. అయితే, ఇందులో అనుష్క శెట్టిని ఫైనల్ చేశారని తాజాగా తెలిసింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా వినిపించాడట. ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన మూవీలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు కూడా తెలిసింది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తోన్నారు.


Click it and Unblock the Notifications











