For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క శెట్టి పెళ్లికి రంగం సిద్ధం.. తన కంటే చిన్నవాడితో ఫిక్స్..ఎవరంటే?

  |

  టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ హోదా సంపాదించింది అనుష్క శెట్టి.. నలబై ఏళ్లు దగ్గర పడుతున్నా ఈ భామ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ప్రభాస్ తో వరుసగా సినిమాలు చేయడం వల్ల ఆయనతో ప్రేమలో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీద చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా సరే ఎప్పుడు వార్తలు దొరక్కపోతే అప్పుడు ఈ వార్తను వండి వారుస్తూ ఉంటాయి చానెళ్ళు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వివరాల్లోకి వెళితే..

  రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

  సూపర్ ఎంట్రీ ఇచ్చి

  సూపర్ ఎంట్రీ ఇచ్చి

  తెలుగు లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో పరిచయం అయింది స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క. ఆ సినిమా పెద్దగా పేరు తీసుకురాకపోయినా ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఎంతలా అంటే ఆమె ఇప్పుడు సౌతిండియాలోని టాప్ మోస్ట్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. మరీ ముఖ్యంగా బాహుబలి సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక బిల్లా మొదలు ప్రభాస్ తో నాలుగు సినిమాల్లో నటించడంతో ఇంకేముంది ఈ ఇద్దరికీ పెళ్లి అనే ప్రచారం జరిగింది.

   ప్రభాస్ తో పెళ్లి

  ప్రభాస్ తో పెళ్లి

  ఈ విషయాన్ని చాలా సార్లు ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు. అయినా సరే ఎప్పటికప్పుడు ఈ వార్త మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది. అందుకే ఇద్దరూ దీని గురించి పట్టించుకోవడం మానేశారు. ఓ పక్క పక్క ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే, అనుష్క మాత్రం అసలు సినిమాలే చేయకుండా ఖాళీగా ఉంది. నిజానికి చాలా రోజుల క్రితం అనుష్క హీరోయిన్ గా నటించిన నిశ్శబ్దం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్నంత మేర అంచనాలను అందుకోలేకపోయింది.

  నిశ్శబ్దంతో సైలెంట్ అయి

  నిశ్శబ్దంతో సైలెంట్ అయి

  హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందని భావించారు. కానీ ఈ సినిమా అనుకున్నంత మేర అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో తాను మరో రెండు సినిమాలకు సంతకాలు చేశానని ఆ సినిమాల గురించి ఆయన నిర్మాణ సంస్థలు ప్రకటిస్తే బాగుంటుందని అనుష్క చెప్పుకొచ్చింది.

  నవీన్ పోలిశెట్టితో సినిమా

  నవీన్ పోలిశెట్టితో సినిమా

  నిజానికి అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమా చేస్తుందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో రా రా కృష్ణయ్య అనే సినిమాకి దర్శకత్వం వహించిన మహేష్ అనే దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడలేదు. వీలైనంత త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది.

  అనుష్కను ఒప్పించిన తల్లితండ్రులు

  అనుష్కను ఒప్పించిన తల్లితండ్రులు


  మామూలుగానే సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండే అనుష్క నిశ్శబ్దం సినిమా రిజల్ట్ తో మరింత దూరం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆమె పెళ్ళికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో అలానే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. చాలా రోజులుగా షూటింగ్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్న అనుష్కతో తల్లిదండ్రులు పెళ్లి గురించి మాట్లాడి ఆమెను ఒప్పించినట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఒక సంబంధం కూడా కుదిర్చారు అనే ప్రచారం జరుగుతోంది.

  Rashmika Mandanna అంటే అంత కోపం ఎందుకు ? Rashmika Biography
   అనుష్క కంటే చిన్నవాడు ?

  అనుష్క కంటే చిన్నవాడు ?

  భారత్ కి చెందిన ఒక బిజినెస్ మాన్ దుబాయ్ లో స్థిరపడగా ఆయన కుమారుడితో అనుష్క వివాహం నిశ్చయమైంది అన్నట్లుగా ప్రచారం మొదలైంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అనుష్క కంటే అతను చిన్నవాడని అంటున్నారు. కరోనా పరిస్థితులు కుదుట పడగానే పెళ్లి తంతు కానిచ్చేస్తారట. గత ఏడాది నుంచి అనుష్క కోసం సంబంధాలు వెతుకుతుంటే చివరికి ఈ సంబంధం వచ్చిందని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది అనుష్క క్లారిటీ ఇస్తే గాని చెప్పలేం. చూడాలి మరి ఎంతవరకూ నిజం అవుతుందో ?

  English summary
  South actress Anushka Shetty has always been in the spotlight for her personal life. Anushka is rumoured to be dating actor Prabhas for a long time now. Speculations around their rumoured wedding keep making headlines every now and then. But recently another speculation came out that anushka is getting married to a Dubai business man.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X