అనుష్క చాలా టిపికల్, ప్రభాస్‌ ఫోన్ చెక్ చేస్తోందట? ఆసక్తిరేపుతున్న కొత్త రూమర్స్!

By Bojja Kumar

Recommended Video

ఆసక్తిరేపుతున్న ప్రభాస్-అనుష్క కొత్త రూమర్స్ !

'బాహుబలి' ప్రాజెక్టు భారీ విజయం సాధించడం, వేల కోట్లు వసూలు చేయడంతో ఈ చిత్రంలో జంటగా నటించిన ప్రభాస్, అనుష్క హైలెట్ అయ్యారు. అప్పటి నుండి ఇద్దరి మీద రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. బాహుబలి తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ పెళ్లి రూమర్స్ అటు ప్రభాస్, ఇటు అనుష్క సన్నిహితులు తోసిపుచ్చారు. అయితే ఈ జంటపై రూమర్స్ మాత్రం ఆగడంలేదు. తాజాగా బాలీవుడ్ మీడియా ఈ జంటపై కొత్త రూమర్స్ ప్రచారంలోకి తెచ్చింది. ప్రభాస్, అనుష్క మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అనుష్క ఒక టిపికల్ గర్ల్ ఫ్రెండ్

అనుష్క ఒక టిపికల్ గర్ల్ ఫ్రెండ్

అనుష్క, ప్రభాస్ ప్రేమ వ్యవహారం మరింత ముందుకెళ్లిందని, అనుష్క ఒక టిపికల్ గర్ల్ ఫ్రెండ్ అని, ప్రభాస్ అంటే అనుష్కకు చాలా ఇష్టమని, అతడు తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకునే మనస్తత్వం ఆమెది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది.

 ప్రభాస్ ఫోన్ చెక్ చేస్తోందట

ప్రభాస్ ఫోన్ చెక్ చేస్తోందట

ప్రభాస్ ఫోన్ రింగ్ అయితే చాలు.... ఫోన్ చేసింది ఎవరు? అంటూ ఆరా తీస్తుందని, తరచూ అతడి ఫోన్ చెక్ చేస్తూ ఉంటుందని నేషనల్ లెవల్ మీడియా వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.

ప్రభాస్ బర్త్ డేకు స్పెషల్ గిఫ్టు ఇచ్చిన అనుష్క

ప్రభాస్ బర్త్ డేకు స్పెషల్ గిఫ్టు ఇచ్చిన అనుష్క

ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అనుష్క స్పెషల్ గిఫ్ట్ ప్రజంట్ చేసింది. ప్రభాస్ ఎంతో ఇష్టపడే డిజైనర్ వాచ్ అతడికి బహూకరించింది.

 ప్రభాస్‌కు వాచీలంటే ఎంతో ఇష్టం

ప్రభాస్‌కు వాచీలంటే ఎంతో ఇష్టం

ప్రభాస్‌తో కలిసి సంవత్సరాల తరబడి పని చేసిన అనుష్క అతడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది. అతడికి డిజైనర్ వాచీలంటే చాలా ఇష్టం. అందుకే అతడి ఇష్టానికి తగిన బహుమతి అందించింది.

 సాహో సినిమాకు అనుష్క ఫస్ట్ చాయిస్

సాహో సినిమాకు అనుష్క ఫస్ట్ చాయిస్

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో' చిత్రానికి మొదట అనుష్కనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

అనుష్క బరువు కూడా కారణం

అనుష్క బరువు కూడా కారణం

సాహో సినిమాకు అనుష్కను అనుకున్న సమయంలో ఆమె బరువు ఎక్కువగా ఉంది. బరువు తగ్గాలని ఆమెకు సూచించారు. అయితే అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టులు కమిట్ కావడంతో తగ్గడానికి చాలా సమయం పడుతుందని చెప్పడంతో.... అంత సమయం వెయిట్ చేయడం కుదరదని బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు.

ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో సినిమా

ప్రభాస్, అనుష్క కాంబినేషన్లో సినిమా

‘సాహో' సినిమాకు అనుష్క చేయనప్పటికీ భవిష్యత్తులో ఇద్దరూ కలిసి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు ఖరారు కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X