twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీ దర్శకుడితో అనుష్క.. ఆస్ట్రేలియాకు వెళ్లిన జేజమ్మ

    |

    బాహుబలి, భాగమతి తర్వాత సోలో హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన అనుష్క శెట్టి మళ్లీ సినిమా ముచ్చటే ఎత్తడం లేదు. అనుష్క సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే బొమ్మాలి మాత్రం అజాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా అనుష్కకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్యానర్లో, క్రేజీ దర్శకుడితో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

    కోన వెంకట్ సినిమాలో

    కోన వెంకట్ సినిమాలో

    భాగమతి చిత్రం తర్వాత కోన వెంకట్ రూపొందించే చిత్రంలో అనుష్క నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు సీక్రెట్ అని పేరు పెట్టారనే విషయం మీడియాలో నానింది. కానీ దానిపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఆ సినిమాపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.

    హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో

    హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో

    ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన మరో ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు అనుష్క పచ్చ జెండా ఊపారనే విషయం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించనున్నట్టు.. ఆ సినిమాకు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    బరువ తగ్గేందుకు ఆస్ట్రేలియాకు

    బరువ తగ్గేందుకు ఆస్ట్రేలియాకు

    ఈ రెండు సినిమాల వార్తలను పక్కన పెడితే ప్రస్తుతం అనుష్కను వేధిస్తున్న సమస్య స్థూలకాయం. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. లావు తగ్గేందుకు అనుష్క ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కూడా క్లారిటీ లేదు.

    చంద్రశేఖర్ ఏలేటి సినిమాతో

    చంద్రశేఖర్ ఏలేటి సినిమాతో

    ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ ఏలేటి సినిమాతో పాటు లేడి ఓరియెంట్ సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారట. ఈ వార్త ఫ్యాన్స్‌కు ఆనందం కలిగించే విషయం అయినప్పటికీ.. అనుష్క సైలెంట్‌గా ఉండటంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆమె మీడియాలో కనిపించి కూడా చాలా రోజులైంది.

    పెళ్లి ఏర్పాట్లలో ఫ్యామిలీ

    పెళ్లి ఏర్పాట్లలో ఫ్యామిలీ

    అనుష్క బరువు తగ్గినా గానీ ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చని, కొన్ని సినిమాలు చేస్తే చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఓ పక్క సినిమాలపై చర్చ జరుగుతుంటే.. మరో పక్క అనుష్క పెళ్లి వార్తలు కూడా భారీగానే వస్తున్నాయి. అనుష్క ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారనే విషయం తెలిసిందే.

    English summary
    Anushka Shetty away from tollywood after Bhagamathie. Now media reports suggest that, Anushka is ready to for Chandra Sekhar Elety movie, Which produced by Mythri movie makers. Now she is prepping for her role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X