twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anushka shetty: తెలంగాణ అబ్బాయితో అనుష్క పెళ్లి.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే!

    |

    టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతూ హవాను చూపిస్తుంటారు. తద్వారా భారీ ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను కూడా బాగానే ఏర్పరచుకుంటున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, తరచూ పెళ్లి వార్తలతో హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనుష్క పెళ్లిపై ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూడండి!

     అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

    అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

    అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమాతో అనుష్క శెట్టి.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. మరిన్ని ఆఫర్లను అందుకుంది. ఇలా తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు, భారీ అవకాశాలను సైతం సొంతం చేసుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

    Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

    ఆ మూవీతో టాప్ హీరోయిన్‌గా

    ఆ మూవీతో టాప్ హీరోయిన్‌గా

    అనుష్క కెరీర్ ఆరంభంలోనే ఎన్నో మంచి అవకాశాలు దక్కించుకుంది. మొదట ఆమె గ్లామర్ పాత్రలకే పరిమితం అయినప్పటికీ.. ఆ తర్వాత పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటించింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు ఫిల్మ్ మేకర్లు కూడా ఫిదా అయిపోయారు. ఇక, 'అరుంధతి' అనే మూవీతో అనుష్క రేంజ్ ఎలా పెరిగిందో అందరికీ తెలిసిందే.

    వరల్డ్ ఫేమస్ అయిపోయింది

    వరల్డ్ ఫేమస్ అయిపోయింది

    వరుస సినిమాలతో సందడి చేస్తూ వచ్చిన అనుష్క దక్షిణాదికే పరిమితం అయింది. అయితే, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో ఈ బ్యూటీ వరల్డ్ మొత్తంలో ఫేమస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఆమె చేసిన దేవసేన పాత్ర ఎంతో హైలైట్ అయింది. రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించిన ఆమె బాగానే మెప్పించిందనే చెప్పాలి.

    Bigg Boss Vote: 4వ వారం షాకింగ్ ఓటింగ్.. ఒక్క ఎపిసోడ్‌కే ఆమె సంచలనం.. ఆ జంటకు మాత్రం బిగ్ షాక్Bigg Boss Vote: 4వ వారం షాకింగ్ ఓటింగ్.. ఒక్క ఎపిసోడ్‌కే ఆమె సంచలనం.. ఆ జంటకు మాత్రం బిగ్ షాక్

    ప్రయోగం విఫలం.. కెరీర్ బ్రేక్

    ప్రయోగం విఫలం.. కెరీర్ బ్రేక్

    అనుష్క 'బాహుబలి' షూటింగ్ జరుగుతున్న సమయంలోనే 'సైజ్ జీరో' అనే సినిమాలో నటించింది. ఇందులో లావు ఉన్న అమ్మాయిగా కనిపించేందుకు ఆమె భారీగా బరువు పెరిగింది. అప్పటి నుంచి అనుష్కకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ మూవీ తర్వాత ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఫలితంగా గతంలో మాదిరిగా ఆమె సినిమాలను చేయలేకపోతోంది.

    అనుష్క.. ప్రభాస్.. ప్రేమ పెళ్లి

    అనుష్క.. ప్రభాస్.. ప్రేమ పెళ్లి

    అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన సమయంలోనే ఈమె పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తుందని, త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ లేకపోయినా తరచూ వీళ్లిద్దరి గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

    స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మక రాజశేఖర్: మైండ్‌బ్లాక్ చేసే ఫోజులతో రచ్చస్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మక రాజశేఖర్: మైండ్‌బ్లాక్ చేసే ఫోజులతో రచ్చ

    అనుష్క మ్యారేజ్ ఫిక్స్ అంటూ

    అనుష్క మ్యారేజ్ ఫిక్స్ అంటూ

    సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన అసుష్క శెట్టి.. ఈ మధ్య కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది. దీంతో ఆమె పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా అనుష్క మ్యారేజ్ గురించి ఓ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ స్టార్ హీరోయిన్ త్వరలోనే వివాహం చేసుకోబోతుందట.

    అనుష్క పెళ్లి ఎవరితో అంటే

    అనుష్క పెళ్లి ఎవరితో అంటే

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త (గోల్డ్ బిజినెస్ చేసే ఫేమస్ వ్యక్తి)తో వివాహానికి సిద్ధం అయిందట. త్వరలోనే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసింది. అంతేకాదు, వచ్చే ఏడాది ఆరంభంలో అనుష్క పెళ్లి జరగబోతుందని కూడా తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

    English summary
    South Indian Actress Anushka Shetty Not Doing Any Films Right Now. Now Her Marriage News Gone Hot Topic in Film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X