సమంత చేయాల్సిన బయోపిక్ అనుష్క చేతిలోకి.. సీనియర్ మోస్ట్ దర్శకుడితో చర్చలు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అనుష్క శెట్టి బాహుబలి సినిమా తర్వాత మళ్లీ చాలా బిజీగా మారిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆమెకు కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ లో కూడా చాలా మంచి గుర్తింపు లభించింది. కానీ అనుష్క శెట్టి మాత్రం ఎవరూ ఊహించని విధంగా సినిమాలు చేయడంలో చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బాహుబలి సినిమా తర్వాత ఆమె దాదాపు పదికి పైగా ఆఫర్లు వచ్చాయి కానీ వాటిలో ఆమె కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. భాగమతి అలాగే నిశ్శబ్దం అనేది రెండు సినిమాలను మాత్రమే చేసింది.

అంతే కాకుండా మధ్యలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. అనుష్క ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడే సినిమాలు స్టార్ట్ చేసేందుకు చాలామంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు కానీ ఆమె మాత్రం గతంలో మాదిరిగా వెంటవెంటనే సినిమాలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఒక కథ ఆమెకు బాగా నచ్చితే గాని గ్రీన్సిగ్నల్ ఇవ్వడానికి మనసు ఒప్పుకోవడం లేదట. నిశ్శబ్దం సినిమా అన్ని భాషల్లో ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ అనుష్క స్టార్ హోదా ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.

Anushka shetty next in Bangalore Nagarathnamma biopic

ఇక సోషల్ మీడియాలో అనుష్క శెట్టి అప్పుడప్పుడు చాలా రేర్ గా స్పందించే ప్రయత్నం చేస్తోంది. వీలైనంత వరకు ఆమె తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ తో ఎంజాయ్ చేస్తోంది. తన అన్నయ్య వదిన అలాగే వారి పిల్లలతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల 90 ఏళ్ల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనుష్క శెట్టి ని ప్రత్యేకంగా కలిసినట్లు సమాచారం. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత ఆధారంగా సినిమా చేయాలని సింగీతం శ్రీనివాసరావు గత కొన్ని ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య దాదాపు సినిమా మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా టాక్ వచ్చింది కానీ కరోనా కారణంగా మళ్లీ వెనుకడుగు వేశారట.

ఇక బెంగళూరు నాగరత్నమ్మ జీవితం ఒక దేవదాసి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఒక దేవదాసి గా మొదలైన ఆమె జీవిత ప్రయాణం ఎంతోమంది సంగీత నృత్య కళాకారులకు ఆసరాగా నిలిచింది. అయితే ఆమె జీవితంకు సంబంధించిన కథలో అనుష్క నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ బయోపిక్ కోసం సమంతను అనుకున్నారు. కానీ ఆమె ఆ ప్రాజెక్టు పై అంతగా ఆసక్తి చూపలేదు. ఇక రీసెంట్ గా సింగీతం శ్రీనివాసరావు అనుష్కను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఇక అనుష్క యూవీ క్తియేషన్స్ లో నవీన్ పొలిశెట్టితో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X