వృద్దురాలిగా మారిపోయిన అనుష్క.. ఆ సమస్య వల్లే ఇలా జరిగిందా!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు మాత్రమే విపరీతమైన ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా ఏర్పరచుకుని సత్తా చాటారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఆమె.. అందం, అభినయంతో మెప్పించింది. దీనికితోడు వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంది. అలా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అనుభవిస్తోంది.

గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేసిన అనుష్క శెట్టి.. ఇప్పుడు కాస్త స్లో అయింది. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో భారీ హిట్ కొట్టింది. ఈ జోష్‌లోనే ఈ భామ.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'ఘాటి' అనే సినిమాను చేస్తుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Anushka Shetty Plays Old Lady Role In GHAATI Movie

అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కలిసి చేస్తున్న 'ఘాటి' సినిమా ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఓ నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని ఇప్పటికే న్యూస్ లీకైంది. ఓ అనుకోని ఘటన వల్ల ఓ సమస్యలో చిక్కుకుని అన్యాయానికి గురైన అమ్మాయి.. శత్రువులను మట్టబెట్టే క్రిమినల్‌గా ఎలా మారింది అన్న స్టోరీలైన్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతున్న 'ఘాటి' సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూట్‌ను జరుపుతున్నారు. దీని తర్వాత ఒడిశా వెళ్లి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఎవరూ ఊహించని ఒక వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Anushka Shetty Plays Old Lady Role In GHAATI Movie

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'ఘాటి' సినిమాలో అనుష్క శెట్టి రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తుందట. అందులో ఒకటి యవతి రోల్ కాగా.. మరో పాత్రలో వృద్దురాలిగా కనిపించబోతుందట. ఇందులో ఆమె గుర్తుపట్టని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఓ సమస్య ఆమె జీవితాన్ని ఎలా మార్చింది అనేది ఇందులో చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందుతోన్న 'ఘాటి' సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X