ప్రముఖ దర్శకుడి కొడుకుతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన అనుష్క శెట్టి

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడితో పెళ్లి అంటూ మీడియాలో వచ్చిన వార్తలపై అందాల తార అనుష్కశెట్టి స్పందించారు. ఇటీవల సోషల్, వెబ్ మీడియా‌లో అనుష్క క్రికెటర్‌ను, ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై అనుష్క ఘాటుగా స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

నా పెళ్లి గురించి అలా రాస్తారా?

నా పెళ్లి గురించి అలా రాస్తారా?

ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తపై స్పందిస్తూ.. అలాంటి వార్తలు ఎలా రాస్తారో నాకు అసలే అర్ధం కావడం లేదు. తప్పుడు వార్తలు రాస్తే వాళ్ల కుటుంబ సభ్యులు బాధపడుతారనే విషయాన్ని కనీసం గ్రహించరా? ఏదైనా, ఎవరిపైనేనా ఊహాగానాలతో వార్తలు రాసే ముందు కనీసం తెలుసుకోవాలి అని అనుష్క అన్నారు.

రూమర్లను పట్టించుకోను

రూమర్లను పట్టించుకోను

ప్రభాస్‌తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి? ఆ మధ్య క్రికెటర్‌తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు డైవోర్సితో పెళ్లి అంటూ వార్తలు రాస్తున్నారు. అలాంటి రూమర్లతో నాకు ఒరిగేదేమి లేదు. నేను పెద్దగా పట్టించుకోను. ఆ విషయాన్ని మీడియా గ్రహించి వాస్తవాలు రాస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని అనుష్క వ్యక్తం చేసింది

పెళ్లి విషయాన్ని దాచగలమా?

పెళ్లి విషయాన్ని దాచగలమా?

సెలబ్రిటీగా ఈ రంగంలో ఎవరితోనైనా రిలేషన్ ఉంటే దాచడం చాలా కష్టం. నా పెళ్లి విషయాన్ని దాచడం సాధ్యమేనా? పెళ్లి, వైవాహిక జీవితం అనేది చాలా సున్నితమైన విషయం. ప్రజలు దాని గురించి మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు కూడా అంతే సున్నితంగా వ్యవహరించాలి అని అనుష్క సూచించారు.

ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం

ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం

ప్రతీ మనిషికి వ్యక్తిగత జీవితం, విషయాలు ఉంటాయి. అలానే నాకు పర్సనల్ స్పేస్ ఉండటంలో తప్పేమి లేదు. నా వ్యక్తిగత విషయాల్లో ఎవరైనా దూర్చడానికి ప్రయత్నిస్తే నేను తట్టుకోలేను. అది నాకు ఇష్టం కూడా ఉండదు. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఎంత ముఖ్యమని భావిస్తారో.. నేను అలానే భావిస్తాను అని అనుష్క అన్నారు.

Recommended Video

Shruti Haasan Hangs Out With Rana Daggubati || Filmibeat Telugu
పెళ్లి విషయంలో దాపరికమా?

పెళ్లి విషయంలో దాపరికమా?

పెళ్లి అనేది ఓ కీలకమైన అంశం. అది ఎప్పుడు జరుగుతుందో.. ఎలా జరుగుతుందో చెప్పలేం. నా జీవితం విషయంలో దాపరికం ఉండదు. ఏదైనా ఉంటే అందరితో సంతోషంగా పంచుకోవాలని అనుకొంటాను. నేను ఎవరిని పెళ్లి చేసుకొంటానో అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నా నోటి నుంచి ఆ విషయాన్ని చెప్పించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది జరగని పని అంటూ అనుష్క స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X