ఆచార్యకు మరో షాక్: చిరంజీవికి హ్యాండిచ్చిన స్టార్ హీరోయిన్.. ప్రభాస్ చేసిన పనే కారణం.!
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని నటుడు. మొదటి తరం హీరోల హవా నడుస్తున్న సమయంలోనే సత్తా చాటి స్టార్‌గా ఎదిగిపోయిన ఈయన.. చాలా కాలం పాటు నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగారు. సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకుని మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఇక, రీఎంట్రీ తర్వాత కూడా ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాకు అనుకోని కష్టం వచ్చింది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిరంజీవికి హ్యాండిచ్చింది. దీనికి కారణం ప్రభాసే అని తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.!

కమ్‌బ్యాక్ అదిరింది.. రెండోది మాత్రం చెదిరింది
రాజకీయాల్లోకి వెళ్లడంతో చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అయితే, ఆయన నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. దీంతో మెగా ఫ్యామిలీకి నిరాశే ఎదురైంది.

ఈ సారి మిస్ కాకూడదని భారీ ప్లాన్ వేశారు
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘సైరా' ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోవడంతో చిరంజీవితో పాటు నిర్మాత రామ్ చరణ్ నిరాశకు లోనయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమాను ప్లాన్ చేశారు. చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే.

లీకులు, పొరపాటుతో మొత్తానికి క్లారిటీ వచ్చింది
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే, వాటన్నీంటిని అబద్ధమని చాలా మంది కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చిరు లుక్ లీక్ అవడంతో ఇందులో ఆయన మావోయిస్టుగా కనిపించబోతున్నారని తెలిసింది. అలాగే, సినిమా టైటిల్ ‘ఆచార్య' అని ఆయనే పొరపాటుగా రివీల్ చేసిన సంగతి విధితమే.

మల్టీస్టారర్ మూవీగా ఆచార్య.. రెండో హీరో ఎవరు.?
దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో హీరో కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ నటిస్తున్నాడని మొదట్లో వార్తలు రాగా, తర్వాత మహేశ్ పేరు తెరపైకి వచ్చింది. కానీ, క్లారిటీ మాత్రం రావడం లేదు. చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

త్రిష ఔట్.. కాజల్ భారీ డిమాండ్.. అనుష్క ఎంట్రీ
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను అనుకున్నారు. అయితే, వ్యక్తిగత కారణాలతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. త్రిష స్థానంలో కాజల్‌ను తీసుకోవాలనుకున్నారు. అయితే, ఆమె భారీ డిమాండ్స్ పెట్టడంతో చిత్ర యూనిట్ అనుష్కను సంప్రదించింది. దీంతో ఇందులో స్వీటీనే హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది.
Recommended Video

ప్రభాస్ వల్ల చిరంజీవికి హ్యాండిచ్చిన స్టార్ హీరోయిన్
కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమాకు సరికొత్త కష్టం వచ్చింది. ఆచార్యలో హీరోయిన్‌గా అనుకుంటున్న అనుష్క.. ఈ సినిమా చేయడం లేదట. దీనికి కారణం ఆమె త్వరలోనే ప్రభాస్ సొంత సంస్థ యూవీ క్రియేషన్స్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతుందట. యంగ్ రెబెల్ స్టార్‌కు గతంలో చేసిన ప్రామిస్ వల్లే అనుష్క ఈ సినిమాకు నో చెప్పిందని సమాచారం.


Click it and Unblock the Notifications











