ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన అనుష్క.. ప్రభాసే కారణమట..

By Rajababu

Recommended Video

ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన అనుష్క.. ప్రభాసే కారణమట

బాహుబలి సంచలన విజయం తర్వాత ప్రభాస్‌తోపాటు అనుష్క శెట్టికి కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ లభించింది. బాహుబలి తర్వాత ప్రభాస్, అనుష్కలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు బాలీవుడ్ ఎంట్రీ కోసం అడిగారు. అందులో హిందీలో బాహుబలిని పంపిణీ చేసిన కరణ్ జోహర్ కూడా ఉన్నారు. అయితే కరణ్ జోహర్ ఆఫర్‌ను ప్రభాసే కాదు.. అనుష్క కూడా రిజెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్నది. అందుకు కారణం ప్రభాస్ అని జాతీయ పత్రికలు కథనాన్ని ప్రచురించాయి. అసలు ఏమి జరుగుతున్నదంటే..

 కరణ్‌కు అనుష్క నో..

కరణ్‌కు అనుష్క నో..

బాహుబలి సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత అనుష్కను తన హిందీ చిత్రంలో నటింపజేయడానికి కరణ్ జోహర్ తీవ్రంగా ప్రయత్నించారట. తమాషా చిత్రంలో నటించాలని అనుష్కకు ఆఫర్ ఇచ్చారట. అయితే ఆ పాత్ర తనకు సూట్ కాదని ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించింది అని ఓ మీడియాలో కథనం వెలువడింది.

 ప్రభాస్ సూచన మేరకేనట.

ప్రభాస్ సూచన మేరకేనట.

అయితే కరణ్ జోహర్ ఆఫర్‌ను తిరస్కరించడానికి ముందు తనకు అత్యంత సన్నిహితుడు ప్రభాస్‌ను సంప్రదించింది. ప్రభాస్ సూచన మేరకే అనుష్క బాలీవుడ్ ఎంట్రీని రిజెక్ట్ చేసింది అనే విషయాలను సదరు జాతీయ వెబ్‌సైట్ కథనంలో పేర్కొన్నది.

 అజయ్ దేవగణ్‌ ఆఫర్ రిజెక్ట్

అజయ్ దేవగణ్‌ ఆఫర్ రిజెక్ట్

బాలీవుడ్ ఎంట్రీ కోసం తన ముందుకు వచ్చిన ఆఫర్లను అనుష్క తిరస్కరించడం ఇదే మొదటిసారి కాదు. అజయ్ దేవగణ్ రూపొందించిన సింగమ్, గోల్‌మాల్ సిరీస్‌లో నటించడానికి అనుష్కను పలుమార్లు సంప్రదించారట. అయితే వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రభాస్‌తో అఫైర్ కొనసాగించడమే అందుకు కారణం అని మీడియాలో రూమర్లు వైరల్ అయ్యాయి.

 ప్రభాస్ అడుగుజాడల్లోనే

ప్రభాస్ అడుగుజాడల్లోనే

బాలీవుడ్ ఎంట్రీని రిజెక్ట్ చేసిన తతంగాన్ని చూస్తే ప్రభాస్ అడుగుజాడల్లోనే అనుష్క నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. కరణ్ జోహర్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్‌ను రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం. కరణ్ జోహర్ సినిమా కోసం దాదాపు రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ అడిగినట్టు వార్తలు వచ్చాయి.

 ప్రస్తుతం భాగమతిలో

ప్రస్తుతం భాగమతిలో

బాహుబలి తర్వాత అనుష్క కొత్తగా చిత్రాలేమీ అంగీకరించిన దాఖలాలు లేవు. బాహుబలి సమయంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భాగమతి చిత్రం మాత్రమే ప్రస్తుతం అనుష్క చేతిలో ఉంది. దర్శకుడు అశోక్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X