ప్రభాస్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిన అనుష్క.. ఆలస్యంగా బయటపడ్డ నమ్మలేని నిజం

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించి.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. గతంలో కంటే ఇప్పుడు పెరిగిన మార్కెట్, ఫాలోయింగ్‌కు అనుగుణంగానే అతడు భారీ చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఇలా ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రభాస్.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయట పడింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Anushka Shetty Rejects Prabhas Starrer Adipurush Movie Offer

వరుస ఫ్లాపులతో షాక్
'బాహుబలి' తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అయితే, దీని తర్వాత అతడి ప్రయాణం ఆశించిన రీతిలో సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. దీనికి కారణం అతడు నటించిన 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ ప్రభాస్ వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు.

సలార్‌తో హిట్ ట్రాక్‌

ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో నటించినా సక్సెస్‌ను అందుకోలేకపోయిన ప్రభాస్.. గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైల్డ్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. తద్వారా ప్రభాస్‌కు చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్‌ను ఈ సినిమా తెచ్చి పెట్టింది.

ఇప్పుడా మూవీలతో
ప్రతి సినిమాతో తన రేంజ్‌ను పెంచుకుంటోన్న రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అతడు 'కల్కి 2898 ఏడీ', 'సలార్ పార్ట్ 2', 'ది రాజా సాబ్', 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Anushka Shetty Rejects Prabhas Starrer Adipurush Movie Offer

ప్రభాస్ ప్రపోజల్‌తో

రెబెల్ స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితమే 'ఆదిపురుష్' అనే మూవీని చేసిన విషయం తెలిసిందే. రామాయణం నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. దీంతో ఎన్నో అంచనాలతో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇందులో నటించమని స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి ప్రభాస్ ప్రపోజల్ పెట్టాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అయిపోతోంది.

రిజెక్ట్ చేసిన భామ
ఫిలిం సర్కిళ్లలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా ప్రభాస్.. అనుష్క పేరునే ప్రతిపాదించడట. దీనికి దర్శకుడు ఓం రౌత్ కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. కానీ, ఇదే విషయంలో అనుష్కను సంప్రదించగా ఆమె మాత్రం ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదని సమాచారం.

మంచే పనే అని

టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే దీనికి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో సీత పాత్రను చూపించిన తీరుపైనా విమర్శలు వచ్చాయి. సో.. ఈ మూవీని అనుష్క శెట్టి రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X