»   » షాకింగ్: సాహూ సెట్స్‌కి సీక్రెట్‌గా వెళ్లిన అనుష్క.. మళ్ళీ రూమర్స్, ప్రభాస్‌కి ఏమైనా అవుతుందనే భయం?

షాకింగ్: సాహూ సెట్స్‌కి సీక్రెట్‌గా వెళ్లిన అనుష్క.. మళ్ళీ రూమర్స్, ప్రభాస్‌కి ఏమైనా అవుతుందనే భయం?

Subscribe to Filmibeat Telugu

ఇండియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బాచులర్స్ లో ప్రభాస్ ఒకడు. బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ జాతీయ వ్యాప్తంగా వ్యాపించింది. ప్రభాస్ కు అమ్మాయిల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి చిత్రంతో దాదాపు మూడేళ్ళ పాటు తీరిక లేకుండా గడిపిన ప్రభాస్ ఆ చిత్రం తరువాతకు కూడా రిలాక్స్ కావడం లేదు. సాహో చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది.

ఏడాది కాలంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండడం విశేషం. అదిరిపోయే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని దర్శకుడు సుజిత్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. తాజగా కొన్ని జాతీయ పత్రికలు ప్రభాస్, అనుష్క గురించి సంచలన కథనాలు ప్రచురిస్తున్నాయి. దీనితో ఈ విషయం అభిమానుల్లో హాట్ హాట్ చర్చకు దారి తీస్తోంది.

దుబాయ్‌లోనే మకాం

దుబాయ్‌లోనే మకాం

గత కొన్ని రోజులుగా సాహో చిత్ర యూనిట్ దుబాయ్ లోనే మకాం వేసింది. ఈ చిత్రంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలని దర్శకుడు సుజిత్ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ లోని ఇతర లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నాడు. దుబాయ్ ప్రభుత్వం కంట్లో పడ్డ రెండవ అంతపెద్ద ఇండియన్ మూవీ ఇదే. హాలీవుడ్ తరహాలో కళ్లుచెదిరే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి.

బెదురు లేకుండా ప్రభాస్

బెదురు లేకుండా ప్రభాస్

ప్రభాస్ ఏమాత్రం బెదురులేకుండా రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ప్రభాస్ బైక్ స్టంట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. డూప్ అవసరం లేకుండా ప్రభాస్ స్వయంగా స్టంట్స్ చేస్తున్నాడట. కాగా కొన్ని జాతీయ పత్రికలు ప్రభాస్, అనుష్క గురించి సంచలన కథనాలు మొదలు పెట్టాయి.

సీక్రెట్‌గా వెళ్లిన అనుష్క

సీక్రెట్‌గా వెళ్లిన అనుష్క

కొన్ని జాతీయ పత్రికల కథనాల ప్రకారం అనుష్క రహస్యంగా దుబాయ్ కు వెళ్లి ప్రభాస్ ని కలిసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేస్తుండడంతో జాగ్రత్త చెప్పడానికి అనుష్క దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేయవద్దని సులువైన పద్దతిని ఫాలో కావాలని అనుష్క సూచించిందట.

మళ్లీ మొదలైన రూమర్స్

మళ్లీ మొదలైన రూమర్స్

ఇప్పటికే అనేక మార్లు ప్రభాస్, అనుష్క రిలేషన్ షిప్ గురించి అనేక పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అనుష్క వివాహానికి సిద్ధం అవుతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలని అనుష్క, ప్రభాస్ ఇప్పటికే ఖండించారు. తాజగా జాతీయ మీడియా కథనాలతో ఈ చర్చ ఎక్కువవుతోంది.

వెండి తెరపై సూపర్ జోడి

వెండి తెరపై సూపర్ జోడి

ప్రభాస్, అనుష్క వెండి తెరపై అభిమానులకు ఇష్టమైన జోడి. అనుష్క, ప్రభాస్ కలసి బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి 2 చిత్రాల్లో నటించారు. వీరి మధ్య కెమిస్ట్రీ ప్రతి చిత్రంలోనూ ఫాన్స్ ని అలరించింది. ఆన్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిమధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

English summary
Anushka Shetty secretly visit Prabhas on the sets of Saaho. Once again rumors on Prabhas, Anushka
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X