అనుష్క, ప్రభాస్ గురించి వైరల్ అవుతున్న రూమర్.. కంఫర్మ్ అయినట్లేనా!
Recommended Video

వెండితెరపై అనుష్క, ప్రభాస్ సూపర్ హిట్ జోడి. అనుష్క, ప్రభాస్ కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. ఇక బాహుబలి చిత్రం అయితే దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. బాహుబలి తిరుగులేని విజయంతో ప్రభాస్, అనుష్క పేర్లు మారుమోగాయి. బాహుబలి చిత్రానికి ముందు అనుష్క, ప్రభాస్ కలసి బిల్లా, మిర్చి చిత్రాల్లో నటించారు. అనుష్క, ప్రభాస్ గురించి తరచుగా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రభాస్ అనుష్క అభిమానులకు పండగలాంటిది అని చెప్పొచ్చు.

బాహుబలి తరువాత
బాహుబలి తరువాత అనుష్క కేవలం ఒక్క చిత్రంలో మాత్రమే నటించింది. అనుష్క నటించిన భాగమతి చిత్రం ఈ ఏడాది విడుదలై మంచి విజయం అందుకుంది. ఆ తరువాత అనుష్క మరో చిత్రంలో నటించలేదు. ప్రస్తుతం అనుష్క ఓ తమిళ చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడిప్పుడే అనుష్క కొత్త కథలు వింటోందట.

రెండు క్రేజీ చిత్రాలతో ప్రభాస్
ప్రభాస్ ప్రస్తుతం 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. యువ దర్శకుడు సుజిత్ ఈ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో 1960 నాటి ప్రేమ కథలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

అనుష్కతో రొమాన్స్
మరోమారు అనుష్క, ప్రభాస్ తో జతకట్టబోతున్నట్లు వస్తున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మరో హీరోయిన్ కు ఆస్కారం ఉందట. ఇప్పటికే ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైంది. 1960 నాటి పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాలతో రాధాకృష్ణ అద్భుతమైన ప్రేమ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో అనుష్క నటించబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

ఖాయమైనట్లేనా
ఈ చిత్రంలో అనుష్క నటించే విషయమై అధికారిక ప్రకటన రాలేదు. కానీ దర్శకుడు రాధాకృష్ణ మాత్రం ఆ పాత్రకు అనుష్క అయితేనే పూర్తి న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క, ప్రభాస్ సూపర్ హిట్ జోడి అనే సెంటిమెంట్ ఉండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాధాకృష్ణ దర్శత్వం వహించే చిత్రం కూడా తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతోంది.

నో అని చెప్పిన ప్రభాస్
ఇదిలా ఉండగా అనుష్క, ప్రభాస్ ప్రేమలో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో అనుష్క, ప్రభాస్ ఈ వార్తలని ఖండించారు. ప్రభాస్, అనుష్క ప్రేమ గురించి ఇటీవల జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో ప్రస్తావన వచ్చింది. అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అని కరణ్ జోహార్ ప్రభాస్ ని ప్రశ్నించాడు. ప్రభాస్ సింపుల్ గా నో అని సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











