For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘నేత్రికన్’ తెలుగు రీమేక్ ప్లాన్ చేసిన యంగ్ హీరో: నయనతార పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌

  |

  ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీల్లోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఓ సైకో వరుసగా హత్యలు చేస్తుండడం.. అతడిని కనిపెట్టేందుకు హీరోనో, హీరోయినో ప్రయత్నాలు చేయడం లాంటి కాన్సెప్టుతోనే ఇలాంటి చిత్రాలు రూపొందుతున్నాయి. వీటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఫలితంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీలు చేయడానికి దర్శక నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు ముందుకు వస్తున్నారు.

  ఈ క్రమంలోనే తాజాగా నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్' అనే సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మంచి స్పందనతో సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమాను టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  ‘నెట్రికన్' అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నయనతార

  ‘నెట్రికన్' అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నయనతార

  విలక్షణ చిత్రాల్లో నటిస్తూ తనలోని నటిని మరింతగా పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది లేడీ సూపర స్టార్ నయనతార. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘నెట్రికన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గృహం' ఫేం మిలింద్ రౌ తెరకెక్కించిన ఈ సినిమాను నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించాడు. అజ్మల్, మణికందన్, శరన్ కీలక పాత్రలను పోషించారు. గిరీష్ గోపాలకృష్ణన్ దీనికి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా నటించింది. ఇది ఆగస్టు 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  అన్ని భాషల్లోనూ అదే స్పందనతో సత్తా

  అన్ని భాషల్లోనూ అదే స్పందనతో సత్తా

  నయనతార సినిమాలు అంటేనే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. విభిన్నమైన కథలతో వినూత్నంగా తెరకెక్కుతాయి. మరీ ముఖ్యంగా ప్రతి చిత్రాన్ని ఆమె తనదైన శైలి నటనతో వన్ ఉమెన్ షో చేసుకుంటుంది. ఇక, ఇప్పుడు ‘నెట్రికన్' మూవీలోనూ ఆమె అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఇందులో నయన్ నటవిశ్వరూపమే చూపించింది. మరీ ముఖ్యంగా అంధురాలి పాత్రలో ఆమె జీవించేసింది. దీంతో ఈ లేడీ సూపర్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక, ఈ చిత్రం కూడా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్‌ను సంపాదించుకుని సూపర్ హిట్‌గా నిలిచింది.

  దానికి రీమేక్‌గా వచ్చింది.. భారీ డిమాండ్

  దానికి రీమేక్‌గా వచ్చింది.. భారీ డిమాండ్

  ‘నెట్రికన్' మూవీ 2011లో వచ్చిన ‘బ్లైండ్' అనే కొరియన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ దక్కించుకుని.. తన ప్రియురాలు నయనతారతో దీన్ని నిర్మించాడు.

  ఓ ప్రమాదంలో కళ్లు పోగొట్టుకున్న సీబీఐ ఆఫీసర్.. ఓ పోలీస్ అధికారి, డెలివరీ బాయ్ సహాయంతో సైకో కిల్లర్‌ను ఎలా అంతమొందించింది అన్న కథతో ఇది రూపొందింది. ఇప్పుడు దీన్ని తమ తమ భాషల్లోకి రీమేక్ చేసుకునేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఆ హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  తెలుగులోకి రీమేక్ చేయబోతున్న హీరో

  తెలుగులోకి రీమేక్ చేయబోతున్న హీరో

  నయనతార నటించిన ‘నెట్రికన్' మూవీని తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని హక్కులను తీసుకుని అందులో మణికందన్ పోషించిన పోలీస్ రోల్‌ను చేయాలని అతడు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను తన స్నేహితుల్లో ఒకరైన దర్శకుడి చేతిలో పెట్టాలని అతడు ఆలోచిస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

  నయనతార పాత్రలో మరో స్టార్ హీరోయిన్

  నయనతార పాత్రలో మరో స్టార్ హీరోయిన్

  ‘నెట్రికన్' మూవీ తమిళంలో తెరకెక్కింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తోన్న అడివి శేష్.. ఇందులో నయనతార పోషించిన పాత్రను అనుష్క శెట్టితో చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు ఓ బడా నిర్మాణ సంస్థతో ఆమె డేట్స్ తీసుకోడానికి కూడా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అనుష్క ఇలాంటి సినిమాలు చేసి మెప్పించింది. అందుకే ఆమెతో నెట్రికన్ తెలుగు రీమేక్ చేయాలని ఈ యంగ్ హీరో పట్టుదలతో ఉన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  సుడిగాలి సుధీర్‌కు పెళ్లి సీక్రెట్ లీక్: ఏకంగా మూడు సార్లు అలా.. ఆమె ఎదుటే రివీల్ చేస్తానంటూ!

  తెలుగులోకి వచ్చినా.. మళ్లీ ఎందుకని?

  తెలుగులోకి వచ్చినా.. మళ్లీ ఎందుకని?

  నయనతార నటించిన ‘నెట్రికన్' మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇది పేరుకు తమిళ చిత్రమే అయినా.. దానితో పాటు తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో వచ్చిన ఈ సినిమాను మళ్లీ అదే భాషలోకి రీమేక్ చేయబోతున్నారన్న వార్త సినీ ప్రియులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, దీనిలో మరిన్ని మార్పులు చేసి ఇంకాస్తా ఆసక్తిగా తెరకెక్కించేందుకు అడివి శేష్ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది.

  Nayanthara's Vasantha Kalam Movie Official Trailer | Yuvan Shankar Raja | Chakri Toleti
  ‘మేజర్' తర్వాత నానిదా? ఈ మూవీనా?

  ‘మేజర్' తర్వాత నానిదా? ఈ మూవీనా?

  అడివి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ‘మేజర్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది దాదాపుగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీని తర్వాత నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ‘హిట్2' అనే సినిమాను చేయబోతున్నాడు. ఇక, ఇప్పుడు ‘నెట్రికన్' మూవీ రీమేక్ తెరపైకి వచ్చింది. దీంతో ‘మేజర్' తర్వాత ఈ యంగ్ హీరో ఏ సినిమా చేస్తాడన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

  English summary
  South Indian Star Heroine Nayanthara Did Netrikann Movie Recently. Now Tollywood Young Hero Adivi Sesh Planing to Remake This Movie with Anushka Shetty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X