Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్క 'నిశ్శబ్దం' ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్.. ఒక్క అడుగు దూరంలో..
భవిష్యత్తులో ఓటీటీ ప్రభావం ఎలా ఉంటుందో కరోనా వైరస్ కారణంగా అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ లాక్ డౌన్ వెండితెరపై మామూలు ప్రభావం చూపలేదు. ఆ ప్రభావం డీజిటల్ వరల్డ్ కి ఎంతగానో బూస్ట్ ఇచ్చింది. వాటి స్టామినా ఏమిటనే విషయంలో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఫ్యూచర్ లో మన స్టార్ హీరోలు ప్రత్యేకంగా ఓటీటీ సంస్థల కోసం సినిమాలు తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
నాని 25వ సినిమా V అక్టోబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని సినిమాలు కూడా త్వరలోనే నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లతో డీలింగ్స్ సెట్ చేసుకునే పనులలో బిజీగా ఉన్నాయి. ఇక అనుష్క నిశబ్దం సినిమా కూడా ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం హాట్ స్టార్ సంస్థ పోటీ పడినప్పటికి చివరికి అమెజాన్ ప్రైమ్ తోనే డీల్ సెట్టయినట్లు తెలుస్తోంది.
దాదాపు అగ్రిమెంట్ కూడా రెడీ అయినట్లు సమాచారం. ఒక్క సైన్ పెట్టేస్తే ఫుల్ పేమెంట్స్ కూడా సెటిల్ చేస్తారట. ఈ సినిమాను ఎలాగైనా సరే థియేటర్స్ లోనే విడుదల చేయాలని కోన వెంకట్ మొదటి నుంచి చాలా బలంగా అనుకున్నాడు. అసలైతే ఈ ఏడాది సంక్రాంతి లేదా ఫిబ్రవరిలోనే సినిమా థియేటర్స్ లో విడుదల కావాల్సింది.
కానీ ఇతర సినిమాలతో పోటీ పడటం ఇష్టం లేక ఒంటరిగా రావాలని అనుకున్నారు. కానీ ఇంతలో కరోనా వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టింది. తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక అమెజాన్ తో డీల్ ఆల్ మోస్ట్ సెట్టయ్యింది కాబట్టి వచ్చే నెల ఏండింగ్ లో నిశ్శబ్దం సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వస్తోంది.