అనుష్క పై మనసుపడ్డ నాగార్జున.. మరోసారి క్రేజీ కాంబో రిపీట్!

సీనియర్ హీరో నాగార్జున మంచి జోష్‌ ఉన్నారు. ఐదు పదుల వయసు దాటినా వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు ధీటైన పోటీ ఇస్తున్నారు. ఈ వయసులో కూడా యంగ్ లుక్‌లో దర్శనమిస్తూ నవ మన్మథుడిలా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా మన్మథుడు 2 సినిమా రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నాగార్జున తన తదుపరి సినిమాలో అనుష్కతో నటించాలని కోరుకుంటున్నాడట.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. మన్మథుడు 2 ఫినిష్ కాగానే వెంటనే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్తారు నాగార్జున. మొదట ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ లేదా నయనతార కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపించింది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ మేరకు అనుష్క కోసం ప్రయత్నాలు చేస్తున్నారట యూనిట్ సభ్యులు.

Anushka Shetty Will Romance With Nagarjuna Again..?

మరోవైపు అనుష్క సైలెన్స్ మూవీ సెట్స్ పై బిజీగా ఉంది. భాగమతి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ భామ.. సరికొత్తగా గ్లామర్ లుక్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే నాగార్జున- అనుష్క జోడీ పలు సినిమాల్లో నటించి మెప్పించింది కాబట్టి 'బంగార్రాజు' లో కూడా ఈ ఇద్దరి జోడీ కనువిందు చేసే ఛాన్సులు ఉన్నాయి. పైగా నాగార్జున కోరుకున్నాడని సమాచారం అందుతోంది కాబట్టి డైరెక్టర్ కాదనే అవకాశాలు ఉండకపోవచ్చు. అంతా అనుకున్నట్లుగా జరిగి ఈ జోడీ సెట్ అయ్యిందంటే మాత్రం ప్రేక్షకులకు మరోసారి కనువిందే మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X