హైదరాబాద్ లోనే కాదు.. అక్కడ కూడా!! తప్పుచేసిన అనుష్క.. అలా జరుగుతుందనే భయంతో..
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అన్నట్లుగా ఉందట స్వీటీ అనుష్క వ్యవహారం. నాలుగు డబ్బులు సంపాదించుకున్నపుడే ఆస్తులు కూడబెట్టుకోవాలని అనుష్క చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయట. తన వ్యక్తిగత జీవితంలో ఇలా జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న అనుష్క.. తొందరపడి తప్పు చేశానని స్వయంగా చెబుతోంది. వివరాల్లోకి పోతే..

ఆస్తి విలువను పెంచుకోవాలనే కోణంలో
చేతిలో కొంత సొమ్ముందంటే దాన్ని పెట్టుబడిగా మలుస్తున్నారు నేటి సినీ సెలబ్రిటీలు. ఆస్తి విలువను పెంచుకోవాలనే కోణంలో ఆ పెట్టుబడి స్థిరాస్తి రూపంలో పెట్టడానికి మక్కువ చూపుతున్నారు. ఇదే విషయాన్ని తొలుత వంట బట్టించుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క.. తీరా సమయానికి తప్పు చేసింది.

తప్పుచేసిన అనుష్క..
సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతూ బాగా సంపాదిస్తున్న సమయంలో అనుష్క, హైదరాబాద్ లోని ఓ పోష్ లొకాలిటీలో ఖరీదైన ఫ్లాటు కొనుగోలు చేసింది. అయితే తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడం, ప్రత్యేక రాష్ట్రం వస్తే, భూముల ధరలు పడిపోతాయేమో అన్న భయంతో దాన్ని అమ్మేసింది అనుష్క.

తొందరపడి అలా చేశా.. అనుష్క పశ్చాత్తాపం
ఆ సమయంలో రూ. 5 కోట్లకు తన ఫ్లాట్ అమ్మిన అనుష్క ఇప్పుడు దాని రేటు చూసి నివ్వెరపోతోందట. అనుష్క తన మనసులో అనుకున్నట్టుగా ఫ్లాట్ ధర పడిపోకపోగా, ఇప్పుడు దాని ధర అమాంతం పెరిగి రూ. 15 కోట్ల వరకూ పలుకుతోందట. దీంతో తాను తొందరపడి తప్పుచేశానని చెబుతోంది అనుష్క.

హైదరాబాద్ లోనే కాదు.. అక్కడ కూడా
ఇక్కడే కాదు.. విశాఖపట్నంలోనూ ఇదే తరహాలో పప్పులో కాలేసిందట అనుష్క. అప్పుడెప్పుడో విశాఖలో భూములను కొనుగోలు చేసిన అనుష్క, చంద్రబాబు సీఎం అయిన తరువాత, అమరావతి అభివృద్ధి చెందుతుందని, విశాఖలో భూముల ధరలు పెద్దగా పెరగబోవని వాటిని కూడా అమ్మేసిందట. ఇప్పుడేమో తాను తొందరపడ్డానని బాధపడుతోందట.

అనుష్క నిశ్శబ్దం
ఇకపోతే కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క.. ప్రస్తుతం 'నిశ్శబ్దం' సినిమాతో బిజీగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











