»   » హాట్ న్యూస్: అల్లు అర్జున్ తాజా చిత్రంలో అనుష్క

హాట్ న్యూస్: అల్లు అర్జున్ తాజా చిత్రంలో అనుష్క

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క చిత్రం రుద్రమదేవిలో అల్లు అర్జున్ చేస్తున్ట్లుగానే, అల్లు అర్జున్ తాజా చిత్రంలోనూ అనుష్క ఆడి,పాడిబోతోంది. అల్లు అర్జున్‌తో కలసి అనుష్క ఆడిపాడబోతోందా? అవుననే చెబుతున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో అనుష్క ఆడిపాడనుందని సమాచారం.

anushka

వేరొక హీరోయిన్ పేరు వినిపించినా ఆ పాటలో అనుష్క కనిపిస్తేనే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆమెని సంప్రదించినట్టు తెలిసింది. బన్నీ, అనుష్క కలిసి 'వేదం'లో నటించారు. ఈసారి ఓ పాటలో సందడి చేయబోతున్నారన్నమాట. ఇందులో బన్నీ సరసన హీరోయిన్ గా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. 'సరైనోడు' అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

తనయుడితో కలిసి?

ఈ కొత్త సినిమాలో అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌తో కలిసి నటించబోతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్‌ చిన్నప్పటి సన్నివేశాల్లో ఆయన తనయుడు అల్లు అయాన్‌ కనిపించనున్నాడని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకొంటున్నారు. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

allu arjun-boyapati

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

English summary
Anushka will do a special song in Allu Arjun&Boyapati Movie.
Please Wait while comments are loading...