నటనకు బైబై... అంటోన్న అనుష్కా శర్మ
బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వైనం అందరికీ తెలిసిందే. అమ్మడికి ఇప్పటికీ ఏమాత్రం డిమాండ్ తగ్గలేదన్నది కూడా వాస్తవమే. కానీ, ఎందుకనో అనుష్కనే స్వయంగా యాక్టింగ్ కు క్రమంగా దూరంగా జరుగుతోందని తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లలో అమ్మడి ప్రొఫైల్ ను పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది.
2008లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్కా శర్మా, 2018 వరకూ దాదాపూ స్టార్ హీరోలందరితోనూ కలసి నటించింది. బాలీవుడ్ బడా ఖాన్స్ అందరితోనూ నటించిన హీరోయిన్ గా పేరుగడించింది. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లను తన కిట్ లో వేసుకుంది. 2018లో జీరో అనే సినిమాలో షారుఖ్ ఖాన్ తో ఆడిపాడిన తరువాత అమ్మడు మళ్లీ లీడ్ రోల్ జోలికి పోలేదనే చెప్పాలి. 2019లో అంగ్రేజీ మీడియం సినిమాలో స్పెషల్ సాంగ్ తరువాత ఇక అమ్మడు సిల్వర్ స్క్రీన్ పైనే కనిపించలేదు.

ఈ మధ్యే వోగ్ మ్యాగజిన్ కోసం బికినీలో దర్శనమిచ్చింది. అయితే, అనుశ్కకు ఆఫర్లు ఇప్పటికీ వెల్లువెత్తుతున్నప్పటికీ, అమ్మడు వాటిని తిరస్కరిస్తోందని తెలుస్తోంది. ఇక పెళ్లికి ముందు నుంచే సినీ నిర్మాణంపై చేపట్టిన అనుశ్క, క్రమంగా అటువైపే పూర్తి దృష్టి నిలిపే ఆలోచన చేస్తోందని వినికిడి. ఈ మధ్యే అమ్మడి నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన పాతాల్ లోక్ అనే వెబ్ సిరీస్, బుల్ బుల్ అనే వెబ్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకున్నాయి.
నిర్మాతగా కావాల్సినంత అనుభవాన్ని గడించిన అనుష్క, ఇకపై అందులోనే రాణించాలని భావిస్తోందట. ఇందులో భాగంగానే నటనకు స్వస్తిపలకాలన్న ఆలోచన కూడా చేస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు. ఏమైనా, ఈ లాంగ్ లెగ్స్ బ్యూటీని ఫ్యాన్స్ మిస్ అవుతారు అనడంలో సందేహమేలేదు.


Click it and Unblock the Notifications











