హాట్ స్టార్ అనూష్క యోగా డీవీడీ వస్తోందా?
శిల్పాశెట్టి, బిబాసా బసు రూటులో అనూష్క కూడా యోగాపై ఓ డీవిడిని రూపొందించే పనిలో ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. సినీ పరిశ్రమకు రాకముందు భూమక భర్త భరత్ ఠాకూర్ వద్ద యోగా నేర్చుకుని బెంగుళూరులో యోగా టీచర్ గా పనిచేసే ఆమె ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్లుగా యోగాని డీవీడీల్లో ఎక్కించే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు కొంత కసరత్తు చేస్తున్నట్లు ఆమెతో సంప్రదింపులు చేసినవారు బయిట చెప్తున్నారు. ఇక ఈ రకంగా చేయటంతో మరింతగా క్రేజ్ వచ్చే అవకాశం ఉండటమే కాక డబ్బు కూడా బాగానే గిట్టుబాటు అవుతుందని ఆమెకు ఈ ప్రపోజల్ పెట్టిన సంస్ధవారు ఒప్పించారని తెలుస్తోంది. ఆమె అభిమానులు మాత్రమే కాక యోగాపై ఆసక్తి,ఆరోగ్యంపై కాన్షస్ ఉన్నవారు ఈ డీవిడీని కొంటారని మంచి మార్కెట్ ఉంటుందని భావిస్తున్నారు. అన్నీ అనూకూలిస్తే రెండు మూడు నెలల్లోనే ఈ డీవీడీ మార్కెట్లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అనూష్క.. మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోంది. అలాగే లారెన్స్ దర్శకత్వంలో మరో చిత్రం సైతం కమిటయ్యందని తెలుస్తోంది. సముద్ర దర్శకత్వంలో పంచాక్షరి చిత్రంలో చేస్తోంది. భూమిక నిర్మిస్తున్న తకిట తకిట చిత్రంలోనూ ప్రధాన పాత్ర చేస్తోంది.


Click it and Unblock the Notifications











