For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాక్ : ‘బాహుబలి’ లో అనుష్క కనపడదు

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘బాహుబలి'. ఈ చిత్రం లో అనుష్క...దేవసేనగా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు సైతం నేర్చుకుంది. దాంతో ఆమె అభిమానులంతా ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రియల్ 17 న ఈ చిత్రం మొదటి భాగం విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న దాన్ని బట్టి ఈ చిత్రం ప్రధమ భాగంలో అనుష్క కనపడదు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  తొలిభాగంలో తమన్నా కనపించనుందని చెప్తున్నారు. రెండవ పార్ట్ లో అనుష్క పాత్ర వస్తుందని చెప్పుకుంటున్నారు. రెండవ పార్ట్ అంటే 2016 సంక్రాంతికి విడుదల అవుతుంది. ఇదే కనుక నిజమే అయితే అనుష్క అభిమానులు...వచ్చే సంక్రాంతి దాకా దేవసేన రాక కోసం ఎదురుచూడాల్సింది. అయితే ఇది అఫీషియల్ గా మేకర్స్ నుంచి వచ్చిన న్యూస్ కాదు.

  Anushka will not appear in Baahubali

  లీక్...

  ఇక ఈ చిత్రానికి సంబంధించిన 12 నిమిషాల ఫైటింగ్ సీన్ వీడియో ఒకటి రీసెంట్ గా ఇంటర్నెట్‌లో లీక్ అయింది. సినిమా షూటింగు దశలోనే ఈ లీక్ వ్యవహారం వెలుగు చూడటంతో ‘బాహుబలి' టీం ఆందోళనలో పడింది. వెంటనే రంగలోకి దిగిన టెక్నికల్ టీం ఆ వీడియోను ఇంటర్నెట్ నుండి క్షణాల్లో తొలగించేసారు.

  అయితే కొందరు ఈ వీడియోను సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో స్ప్రెడ్ కాకుండా బాహుబలి టీం సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీడియో లీకు వ్యవహారంపై చిత్ర నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇప్పటికే పోలీసులు ఈ లీక్ వెనక గల వ్యక్తులను అరెస్టు చేసారు.

  వీడియోను ఎవరైనా సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు. అసలు ఈ వీడియో లీక్‌కి కారణం ‘బాహుబలి' చిత్రానికి గ్రాఫిక్స్‌ వర్క్‌ చేస్తున్న కంపెనీకి సంబంధించిన మాజీ ఉద్యోగి అని తెలుస్తోంది. అయితే ఈ వీడియో మొత్తం గ్రీన్‌ మ్యాట్‌తో షూటింగ్‌ చేసింది. దీనికి 80 శాతం వీ.ఎఫ్‌.ఎక్స్‌ చేస్తేగానీ ఫైట్‌ సీన్‌కు అర్ధం ఉంటుంది.

  Anushka will not appear in Baahubali

  బిజినెస్...

  ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి.

  ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం.

  మరో ప్రక్క....

  Anushka will not appear in Baahubali

  ఆ మధ్యన విడుదల చేసిన 'విజువలైజింగ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ బాహుబలి' వీడియోకు వచ్చిన స్పందన పట్ల యూనిట్ సంతోషంగా ఉంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు.

  ప్రభాస్‌, అనుష్క , తమన్నా, రానా, సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బాహుబలి'. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రం పుస్తకం రెడీ చేస్తున్నారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పుస్తకంలో చిత్రం మేకింగ్ గురించి ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిత్రం కోసం వేసిన స్కెచ్ లు, షూటింగ్ విశేషాలతో ఈ పుస్తకం సిద్దం చేస్తున్నట్లు వినికిడి. సినీ లవర్స్ కు ఈ పుస్తకం మంచి గిప్టే మరి.

  సినిమా షెడ్యూల్‌ గురించి వివరిస్తూ....

  Anushka will not appear in Baahubali

  ‘‘సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్యాచ్‌వర్క్‌, మైనర్‌ టాకీ, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. తాజా షెడ్యూల్‌ఆదివారం రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. 2015 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్‌, సంగీతం: యం.యం.కీరవాణి.

  ఆ మధ్యన నిర్మాతలు విడుదల చేసిన సినిమా స్టిల్‌లో ప్రభాస్‌ను చూస్తే టైటిల్‌కు సంపూర్ణ న్యాయం చేస్తున్నవాడిలా కనిపించాడు. వీరయోధుడి దుస్తుల్లో, రెండు చేతుల్లో ఆయుధాలతో, కండలు తిరిగిన దేహంతో ఉన్న ప్రభాస్‌ రూపానికి నిజంగానే విశేషమైన స్పందన వచ్చింది.

  మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

  రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ ఇన్ఫోని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే... వాట్స్ అప్ యాప్ లో దొరుకుతుందని చెప్తున్నారు. ఈ మేరకు 809675522 నెంబర్ ని విడుదల చేసారు. ఈ నెంబర్ ని మీరు వాట్సప్ లో యాడ్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు చిత్రం గురించి ఎక్లూజివ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు.

  ఇక ...

  కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్‌ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

  'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.

  రాజమౌళి కొత్త ఆలోచన:

  లైవ్‌ యాక్షన్‌ సినిమా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్‌ యాక్షన్‌ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్‌ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.

  ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్‌ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్‌ తయారు చేసే పనిలో ఉందట.

  ఓ చిప్‌లో మొత్తం ఎఫెక్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్‌ మీద ఏమైతే విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మిక్స్‌ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

  English summary
  Prabhas-Anushka Shetty's magnum opus "Baahubali" (Part 1) expected to hit the screens on the tentative release date of 17 April.According to sources Anushka will not be present in the first part of the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X