అనుష్క సైడ్ బిజినెస్ : మూడు రోజులకు కోటి

By Srikanya

హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే స్కీమ్ మన హీరోయిన్స్ కు తెలిసినట్లుగా వేరే వాళ్లకి తెలియదేమో. క్రేజ్ ఉండగానే నాలుగు కోట్లు వెనకేసుకోవాలనేది వారి ఆలోచన. అనుష్క ఇప్పుడు బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలో క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలు రిలీజయ్యాక ఇంకా క్రేజ్ పెరగాల్సిందే కానీ తగ్గేది లేదు. ఈ నేపధ్యంలో ఆమె వెనక కంపెనీలు తమ బ్రాండ్ లను ప్రమోట్ చేయమని పడుతున్నాయి. సర్లే ఆ డబ్బుని మాత్రం ఎందుకు వదులుకోవాలని ఆమె బాగానే ఛార్జ్ చేస్తోందని సమాచారం.

రీసెంట్ గా ప్రముఖ కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్ల సంస్థ ఇంటెక్స్‌ నూతన ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అనుష్క ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయటానికి గానూ అనుష్క కోటిరూపాయల వరకూ ఛార్జ్ చేసిందని వినికిడి. ఇందు నిమిత్తం ఆమె మూడు రోజులు మాత్రమే సంవత్సరంలో క్యాంపైన్ లో పాల్గొంటుంది. ఆ క్యాంపైన్ లో ఫొటో షూట్ జరుగుతూంటుంది. అది ఆమెకు కొట్టిన పిండే. గతంలో ఆమె ఇలాంటి వాటికి నలభై లక్షలు ఛార్జ్ చేసేది. ఇప్పుడు రేటు పెంచిందని అంటున్నారు.

Anuskha pocketed One Crore

ప్రసుత్తం తమిళ, తెలుగు పరిశ్రమల్లో వరుస భారీ సినిమాలతో బిజీగా ఉందీ భామ. వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనుష్క మరో పెద్ద ఆఫర్ ని తన ఖాతాలో వేసుకొంది. రజనీకాంత్ సరసన ఆమె హీరోయిన్ గా లింగా చిత్రం చేస్తోంది. కె.ఎస్ రవికుమార్ దర్శకుడుగా ఈ చిత్రం రూపొందుతోంది. గతంలోనూ రెండు సార్లు రజనీతో ఆమె ఛాన్స్ మిస్సైందని,ఈసారి ఎలాగయినా ఆయనతో నటించాలనే అనుష్క నిర్ణయిం తీసుకుని డేట్స్ ఎడ్జెస్ట్ చేయటానికి ముందుకు వచ్చిందని కోలివుడ్ సమాచారం.

అలాగే హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క మరో భారీ చిత్రం కమిటైంది. తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం అది. అజిత్ హీరోగా తెరకెక్కె ఆ చిత్రం వేసవిలో సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ రుద్రమదేవి,రాజమౌళి బాహుబలిలో నటిస్తోంది. రెండు చిత్రాలలోనూ ఆమె రాని గా కనిపించనుంది. అయితే గౌతమ్ మీనన్ చిత్రంలో ఆమె అల్ట్రా మోడ్రన్ గెటప్ లో కనిపించనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X