»   »  అవునూ...అభినయనశ్రీని పెళ్ళాడేదెవరు?

అవునూ...అభినయనశ్రీని పెళ్ళాడేదెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Abhinaya Sree
అ..అంటే అమలాపురం అంటూ అదరకొట్టిన ఐటం గర్ల్ అభినయశ్రీ ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని తలపోస్తోంది. అందుకోసం ఆమె తల్లి మాజీ ఐటం డాన్సర్ అనూరాధ వరుళ్ళ వేట ప్రారంభించిందిట. అయితే ఆమె మ్యారేజి బ్యూరో లలో అభినయశ్రీ ఫొటోలిచ్చి ఎంక్వైరీ చేస్తోందిట. అయితే ఆమె ఫొటో అక్కర్లేని మనిషాయే. నిజం చెప్పాలంటే పరిచయం కూడా అక్కర్లేని అమ్మాయి. దాంతో కుర్రాళ్ళు కాస్త జడుస్తున్నారుట. అందులోనూ పెళ్ళి తర్వాత ఆమె నటిస్తుందా లేదా అన్నది స్పష్టం చేయటం లేదట.

అయితే కొందరు సినిమా పరిశ్రమలో వాళ్ళు ఎర వేస్తున్నారుట. ఆమె సంపాదించింది ఏమైనా ఉంటే స్వాహా చెయ్యచ్చనేది వారి ప్లాన్ ట. అయితే అనూరాధ ఉన్నంత కాలం అది సాగదు కానీ ...ఆమె తదనంతరం పరిస్ధితి ఏమిటని ఆమె ఆలోచనలో పడుతోందిట. అందుకే కాస్త బుద్దిమంతుడైన వాడైతే ఈ రకమైన సమస్యలు ఉండవనేది ఆమె ఆలోచన. అయితే అనూరాధ తన భర్త మొదలియార్ ని వదిలేసినట్లే అభినయశ్రీ కూడా చేస్తే ...ఏంటన్నది ఆమెని పెళ్ళి చేసుకుందామనుకునే వారిముందన్న పెద్ద ప్రశ్న.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X