మహేశ్, అల్లు అర్జున్ సినిమాల నిర్మాతలకు కొత్త టెన్షన్.. అక్కడ విడుదల కష్టమేనా.!
సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అంటే ఎంతో ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ పండుగ సమయంలో తమ సినిమాలను విడుదల చేయడానికి ఫిల్మ్ మేకర్లు సన్నాహాలు చేస్తుంటారు. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా కొన్ని భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలపై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు మూవీలు ఒకరోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల నిర్మాలతను ఓ సమస్య తెగ టెన్షన్ పెడుతుందట. ఇంతకీ ఏంటా సమస్య.? పూర్తి వివరాల్లోకి వెళితే...

మహేశ్ సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటాడట
‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి వరుస హిట్‌లతో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే అతడు అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించబోతున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో విజయశాంతి, బండ్ల గణేష్, ప్రకాశ్ రాజ్, సంగీత కీలక పాత్రలు చేస్తున్నారు.

వైకుంఠపురములోకి ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, నవదీప్, సుశాంత్, టబు, సముద్రఖని, మురళీ శర్మ, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆ విషయంలో మాత్రం పోటాపోటీగా చేస్తున్నారు
సంక్రాంతికి ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అది కూడా ఒకరోజు వ్యవధిలోనే ఈ రెండు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు యూనిట్లు ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేశాయి. ఒకదాని తర్వాత ఒకటి పాటలు, టీజర్లు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తూ దూసుకుపోతున్నాయి. దీంతో రెండింటిపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

రెండూ సూపర్ సక్సెస్ అయ్యాయి
ఈ మధ్య ఒకరోజు గ్యాప్‌లో సరిలేరు చిత్ర యూనిట్, అల టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించింది. మహేశ్ సినిమా ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే, మ్యూజికల్ కాన్సర్ట్ పేరిట నిర్వహించిన బన్నీ సినిమా ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్ లేకున్నా భారీ స్థాయిలో ఫ్యాన్స్ వచ్చారు. దీంతో ఇది కూడా విజయవంతం అయింది.

నిర్మాతల మధ్య విభేదాలు.. చివరికిలా
ఈ రెండు చిత్రాల నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇటీవల ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లుగానే వాళ్లంతా కలిసి రిలీజ్ డేట్ల విషయంపై పలుమార్లు చర్చలు కూడా జరిపారు. దీంతో ఈ రెండు మూవీల రిలీజ్ డేట్లు మారుతాయని అన్నారు. కానీ, నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశం సఫలం కావడంతో గతంలో ప్రకటించినట్లుగానే విడుదల అవుతున్నాయి.

మహేశ్, బన్నీ సినిమాల నిర్మాతలకు కొత్త టెన్షన్
రెండు సినిమాల విడుదలకు ఎంతో సమయం లేదు. ఇలాంటి సమయంలో ఏపీ రాజధాని విషయంలో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న నిరసనల ఎఫెక్ట్ సినిమాలపై పడనుందా అని రెండు చిత్రాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, అక్కడ సినిమాలు రిలీజ్ అవుతాయన్న అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











