Pawan Kalyan ఆ స్టార్ హీరోకు ఆస్తులు అమ్మిన పవన్ కల్యాణ్.. ఎవరో తెలిస్తే పక్కా స్టన్!
పవర్ స్టార్, జనసేన ఛీప్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రచార సభలు, కార్యక్రమాలు అంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఈ మధ్య ఆయన ప్రచారం కోసం డబ్బు ఖర్చుపెట్టేందుకు తన సొంత ఆస్తులను సైతం అమ్మేందుకు రెడీ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ ఆస్తులను కొనేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. పూర్తి వివరాలను స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం..
ఎన్నికల్లో నిలబడాలంటే మాములు విషయం కాదు. కేవలం మంచి పేరు, హోదా, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటే అస్సలు సరిపోదు అన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెనకాల కోట్ల రూపాయాలు, విలువైన ఆస్తులు చేతిలో ఉండాల్సిందే. అప్పుడే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుంచి పోలింగ్ పూర్తై రిజల్ట్ వచ్చేవరకు ఓటర్లకు , కార్యకర్తలకు, ఇతర నేతలకు డబ్బును సర్దుతూ పంచిపెడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది.

ఇంత చేస్తే కానీ ఎన్నికల్లో నిలబడి గెలచేందుకు అవకాశాలు ఉంటాయి. ఒక అభ్యర్థికే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటిది ఓ పార్టీని నడుపుతున్న అధినేతకైతే అంతకన్నా ఎక్కువ అవుతాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికేల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచార సభలు, కార్యక్రమాలు, విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా గెలుపే లక్ష్యంగా తేదేపాతో కలిసి ఫుల్ యాక్టివ్‌గా ప్రచారంలో పాల్గొంటోంది.
అయితే తన దగ్గర ఈ ఎన్నికల కోసం ఖర్చు పెట్టేందుకు ఎక్కువ డబ్బు లేదని, నిజయితీ, ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశంతోనే ముందుకు వెళ్తున్నానని అంటున్నారు పవన్. కానీ కనీస అవసరాల ఖర్చుల కోసం తన సొంత ఆస్తులను సైతం అమ్మేందుకు పవన్ రెడీ అయినట్లు ఈ మధ్య జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఓ స్టార్ హీరో రెడీ అయ్యారని కొత్త ప్రచరాం మొదలైంది.

ఆయన ఎవరో కాదు స్వయానా పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. తన తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద ఆలోచనే చేసినట్లు సమాచారం అందుతోంది. పవన్‌కు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్కసారి పోగొట్టుకున్న ఆస్తులను మళ్లీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టమైన విషయం. మరి అలాంటిది తన తమ్ముడు ఈ రాజకీయాల కోసం కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇళ్లులు , భూములను అమ్మెందుకు రెడీ అయ్యారని తెలిసి చిరు రంగంలోకి దిగారట. ఇప్పటికే కాస్త ఆస్తిని పవన్ వేరేవాళ్లకు అమ్మేశారట.
దీంతో చిరు.. పవన్‌ను ఆస్తులు అమ్మవద్దని సూచించారట. పవన్ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, కావాలంటే కావాల్సిన డబ్బును తాను ఇస్తానని చెప్పారట. కానీ పవన్ దానికి ఒప్పుకోలేదట. ఇద్దరి మధ్య చర్చలు జరిగాయట. చివరికి చిరునే ఆస్తులను తీసుకోనున్నారని బయట మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications










