twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan kalyan దెబ్బతో మళ్ళీ రగడ.. అల, సరిలేరు రిపోర్టులు కావాలని ఏపీ సర్కార్ ఆదేశాలు!

    |

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్య ఏర్పడిన వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది నిర్మాతలు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో భేటీ అయి రావడంతో ఈ వివాదం ఇక్కడితో తెర పడుతుందని అందరూ ఆశించారు. అయితే నిన్న జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి సహా మంత్రులను టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    రాజకీయంగా

    రాజకీయంగా

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్య ఒక వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగి సినిమా టికెట్ రేట్లను సవరించడమే కాక బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వడం లేదని ప్రకటించిందని అందరూ భావిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలతోనే పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని అందుకే ఆయన సినిమాను అడ్డం పెట్టుకుని టికెట్ రేట్లు అన్ని తగ్గించారని ఆరోపణలు వచ్చాయి.

    అదేమీ లేదని చెప్పినా

    అదేమీ లేదని చెప్పినా

    అయితే ఈ విషయం మీద ప్రభుత్వం అప్పట్లో అదేమీ లేదని ఖండించింది కానీ అసలు విషయం ఏమిటి అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లు అమ్మకం కోసం ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించబోతున్నదని టికెట్ అమ్మకాలు అన్నీ ఆ పోర్టల్ ద్వారా మాత్రమే జరగబోతున్నాయి అని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఇది ఇంకా నిర్ణయం తీసుకోలేదని సినిమా పెద్దలు ఇలా ఒక పోర్టల్ రూపొందిస్తే బాగుంటుంది అని తమను కోరితే దాని మీద ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు.

    అంతేకాక పవన్ కళ్యాణ్ విషయంగా ఈ నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్న ఆయన ఉదాహరణకు సరిలేరు నీకెవ్వరు సినిమా 200 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని ప్రచారం జరిగిందని కానీ టాక్స్ లు మాత్రం రాలేదు అని చెప్పుకొచ్చారు. అందుకే ఈ విషయంలో ద్రుష్టి పెట్టమని ఆయన అన్నారు.

    నానితో భేటీ

    నానితో భేటీ

    ఈ ప్రెస్ మీట్ అనంతరం టాలీవుడ్ సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నాని తోనే భేటీ అయ్యారు. ఈ భేటీ సమయంలో సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం వందల కోట్లు కలెక్షన్ సాధించింది అని వేస్తామని ప్రేక్షకులను తమ సినిమాకు ఎలా అయినా రప్పించాలి అనే ఉద్దేశంతోనే అలా చేస్తారు తప్ప నిజంగా అన్ని వందల కోట్ల రావు అని చెప్పుకొచ్చారు.

    అలాగే ముగ్గురు - నలుగురు సినిమా హీరోల సినిమాలకు తప్ప మిగతా వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఈ విషయం మీద దృష్టి పెట్టాలని కూడా కోరారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో ఇంకా ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుందని భావిస్తున్నామని కళ్యాణ్ మీడియా ముందు కూడా చెప్పారు.

    పవన్ దెబ్బతో

    పవన్ దెబ్బతో

    ఇదంతా జరిగిన కొద్దిరోజులకే అంటే నిన్న సాయంత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా రిలీజ్ ఈవెంట్ కు హాజరై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. ఈరోజు ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలకు సంబంధించి అన్ని టాక్స్ సక్రమంగా కట్టారా లేదా అనే విషయాల మీద ఆరా తీస్తున్నట్లు సమాచారం.

    ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏరియాల వారీగా సినిమా కలెక్షన్స్ రిపోర్టును తమకు సబ్మిట్ చేయాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్లు ఆదేశించినట్లు సమాచారం.

    Recommended Video

    Allu Arjun యుట్యూబ్ లో, Mahesh Babu ట్విట్టర్ లో Thaggede Le || Filmibeat Telugu
    టాలీవుడ్ మీద ఫోకస్

    టాలీవుడ్ మీద ఫోకస్

    గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ రెండు సినిమాలు పోటా పోటీగా కలెక్షన్స్ సాధించాయి అని రెండు సినిమాల మేకర్స్ ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆ మేరకు తమ పనులు రాలేదని అంటోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లు అవడంతో ఈ వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ల అందరికీ ఆదేశాలు అందాయని అంటున్నారు.

    చూడబోతే ఈ వివాదం చాలా దూరం వెళ్లేట్టుగానే కనిపిస్తోంది. దీంతో గతంలో ఆంధ్రప్రదేశ్ మంత్రితో సమావేశమైన సినీ నిర్మాతలు మళ్లీ ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ల ను ఆదేశించింది అనే విషయం మీద అధికారిక ప్రకటన ఏమి వెలువడలేదు..నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆదేశాలు జారీ చేసినట్లు అయితే టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టినట్లుగానే చెప్పాలి. మరి ఈ విషయంలో ఈ వ్యవహారం ఎంత దాకా ఉంది అనేది ఆసక్తికరంగా మారింది.

    English summary
    AP government requested distributors to share the area wise collections of Ala vaikunthapurramuloo and Sarileru Neekevvaru to verify the tax payments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X