RRR :చివరి నిముషంలో ఏపీ ప్రభుత్వం షాక్.. రంగంలోకి కలెక్టర్లు.. ఏమైందంటే?

బాహుబలి లాంటి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం RRR. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన రెండు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోలు నటించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదల కాబోతుండగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు అవకాశం కల్పించాయి. అయితే చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు RRRకి అనుకోని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

భారీ బడ్జెట్తో

భారీ బడ్జెట్తో


దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన తాజా చిత్రం RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తూండగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు.

పాన్ ఇండియా

పాన్ ఇండియా


కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను అందించగా బాహుబలికి కెమెరామెన్ గా వ్యవహరించిన సెంథిల్కుమార్ ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ముందు నుంచి పాన్ ఇండియాలో విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని లాంటి అనేక ఇతర భాషలకు చెందిన నటులను కూడా తీసుకున్నారు.

టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం

టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం


వీరు కాక శ్రేయ, శ్రీ రాజీవ్ కనకాల రాహుల్ రామకృష్ణ వంటి అనేకమంది నటులను కూడా సినిమా లో భాగం చేశారు. ఈ సినిమా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో నే రాజమౌళి, రామ్ చరణ్, నందమూరి తారక రామారావు ముగ్గురు కూడా భారతదేశం మొత్తం పర్యటనలు చేసి సినిమా మీద మరింత హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

మరో షాక్

మరో షాక్


ఆ హామీ మేరకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించింది. సినిమా విడుదలైన పదిరోజులపాటు సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవచ్చని ఏపీలో మొదటి పది రోజులు టికెట్ రేట్లు కనిష్టంగా రూ. 106 గరిష్టంగా రూ. 380 నిర్ణయించారు.అయితే అది అలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో షాక్ ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది అని ప్రచారం జరుగుతోంది.

 బెనిఫిట్ షోలు వేయకూడదని

బెనిఫిట్ షోలు వేయకూడదని


ఏపీ ప్రభుత్వం ట్రేడ్‌ వర్గాల వారికీ కు షాక్ ఇచ్చింది. పెరిగిన ధరలకు టిక్కెట్‌లను విక్రయిస్తున్నారని చెబుతూ థియేటర్ల యాజమాన్యాలను రెవిన్యూ అధికారులు హెచ్చరించారు. ఉదయం 6 గంటల లోపు ఎటువంటి బెనిఫిట్ షోలు వేయకూడదని కలెక్టర్లు థియేటర్ యజమానులను హెచ్చరిస్తున్నారు. చివరి నిమిషంలో దాడులు చేయడంతో థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి చూడాలి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X